పత్రికా ప్రకటన తేది: 28-07-20 21
జిల్లాలో ఆహార శుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేయుటకు జిల్లా లో ఉండే రైతులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ శృతి ఓజా అన్నారు.
బుధవారం కలెక్టరేట్ సమావేశం హాలు నందు ఆహార శుద్ధి పరిశ్రమల అధికారులతో ప్రధాన మంత్రి ఫోర్మలైజేషన్ మైక్రో ఫుడ్ ఎంటర్ ప్రైజెస్ (PMFME) జిల్లా స్తాయి సమావేశంలో మాట్లాడుతూ స్కీం లో బాగంగా 25 దరకాస్తులకు సంబందించిన ప్రపోసల్స్ ను కమిటి లో విస్రుతంగా చర్చించి వీటికి డి ఆర్ పి సైట్ ఇన్స్పెక్షన్ చేసి ఆన్లైన్ లో అప్రూవల్ చేయాలనీ అన్నారు. చిన్న కుటీర పరిశ్రమలకు ప్రాదాన్యత ఇచ్చి రుణాలు మంజూరు చేసే విదంగా చర్యలు చేపట్టాలని ఎల్ డి ఎం కు ఆదేశించారు. వ్యవసాయ అధికారులు, ఉద్యాన వన శాఖ అధికారులు మండలాలు, గ్రామాలలో ఉండే రైతులను మోబిలైజ్ చేసి ఈ స్కీం లో ఉండే బెనిఫిట్స్ ను వివరించి యూనిట్స్ పెట్ట్టే విదంగా రైతులకు అవగాహన కలిపించాలని అన్నారు. గ్రామాలలో సదస్సులు ఏర్పాటు చేసి వ్యక్తి గతంగా 10 లక్షల లోన్ కు 35 శాతం సబ్సిడీ ఉంటుందని రైతులకు తెలపలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లకు పల్లి రైతులను గుర్తించాలని ఈ నెల 31 వరకు ప్రాసెస్ చేయాలనీ తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ అధికారి హైదరాబాద్ ప్రభంజన్, డి ఆర్ డి ఓ ఉమా దేవి, వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, ఉద్యానవన శాఖ అధికారి సురేష్, ఎల్ డి ఎం సురేష్ తదితరులు పాల్గొన్నారు.
————————————————————————————–
జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి ద్వారా జారి చేయబడినది.
