జిల్లాలో ఈ నెల 10 వ తేదీ వరకు రైతుబంధు వారోత్సవాలు : నాఫ్స్కాబ్ చైర్మెన్ కొండూరు రవీందర్ రావు

జిల్లాలో ఈ నెల 10 వ తేదీ వరకు రైతుబంధు వారోత్సవాలు : నాఫ్స్కాబ్ చైర్మెన్ కొండూరు రవీందర్ రావు

*ప్రచురణార్థం-3*
రాజన్న సిరిసిల్ల, జనవరి 04: రాష్ట్రంలో రైతుబంధు పథకం ద్వారా ఇప్పటివరకు పంపిణీ చేసిన రూపాయలు 50 వేల కోట్లకు చేరడంతో రాష్ట్ర ప్రభుత్వంచే రైతు బంధు వారోత్సవాలను ఈ నెల 3 నుండి 10 వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని నాఫ్స్కాబ్ చైర్మెన్ కొండూరు రవీందర్ రావు అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని డీఆర్ఓ చాంబర్ లో ఇంఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావుతో కలిసి రైతుబంధు వారోత్సవాల నిర్వహణపై చైర్మన్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 8వ విడతతో కలిపి రైతుబంధు పథకం కింద రైతులకు ఇచ్చిన డబ్బులు మొత్తం 50 వేల కోట్ల రూపాయలకు చేరడం జరిగిందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతులకు ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఇది ప్రపంచంలోనే వినూత్న ఆలోచన అని, వ్యవసాయ రంగానికి ఏటా 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. ఈ నెల 10 వ తేదీ వరకు జిల్లాలో సంబరాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు మాట్లాడుతూ, రైతుబంధు పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు 1 లక్షా 21 వేల మంది రైతులకు 943 కోట్ల రూపాయలను పంట పెట్టుబడి సాయం కోసం పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.
రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య మాట్లాడుతూ, రైతుల శ్రేయస్సు కోరి వారికి పంట పెట్టుబడి సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం రూపంలో ఆర్థిక సహాయం అందిస్తుందని, ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు 50 వేల కోట్లను పంపిణీ చేయడం గొప్ప విషయమని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రణధీర్ కుమార్, ఉద్యానవన శాఖ అధికారిణి జ్యోతి, జిల్లా పంచాయితీ అధికారి రవీందర్, జిల్లా సహకార శాఖ అధికారి బుద్ధనాయుడు, జిల్లా విద్యా శాఖ అధికారి రాధాకిషన్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Share This Post