జిల్లాలో ఈ నెల 8 వ తేదీ సోమవారం నుండి పోడు వ్యవసాయదారుల క్లయిమ్స్ స్వీకరణ ప్రారంభం కానున్న సందర్భంగా సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగనున్న “గ్రీవెన్స్ డే”ను రద్దు పరుస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు.

ప్రచురణార్ధం

నవంబరు, 06, ఖమ్మం:

జిల్లాలో ఈ నెల 8 వ తేదీ సోమవారం నుండి పోడు వ్యవసాయదారుల క్లయిమ్స్ స్వీకరణ ప్రారంభం కానున్న సందర్భంగా సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగనున్న “గ్రీవెన్స్ డే”ను రద్దు పరుస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు మండల ప్రత్యేక అధికారులుగా పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించుచున్నందున, అదేవిధంగా రెవెన్యూ డివిజనల్ అధికారులు డివిజన్ స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నందున, మండల స్థాయి అధికారులు ఫారెస్ట్ రైట్ కమిటీలో సభ్యులుగా ఉండి క్లయిమ్స్ స్వీకరణ ప్రక్రియలో పాల్గొంటున్నందున ఈ నెల 8 వ తేదీ సోమవారం జరుగనున్న “గ్రీవెన్స్ డే”ను రద్దుపరుస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించవలసినదిగా కలెక్టర్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

Share This Post