జిల్లాలో ఉచిత శిక్షణకు దరఖాస్తూ చేసుకున్న గ్రూప్ 1, 4 అభ్యర్థులకు తరగతులను రేపటి నుండి ప్రారంభించాలని అదనపు కలెక్టర్ పద్మజ రాణి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించడానికి తీసుకోవాల్సిన చర్యల పై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణాలో ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలనే ఉదేశ్యంతో ప్రభుత్వం ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ నోటిఫికేషన్ సందర్భంగా జిల్లా లో ఉన్న యస్సీ, యస్టి మరియు బిసి విద్యార్థులకు ఉచిత శిక్షిణ శిభిరాన్ని జిల్లా కేంద్రం లోని కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిచేర్ లో 29ఏప్రిల్ నాడు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. జిల్లా లో యస్సీ 83, యస్టి 30మరియు బిసి 100 అభ్యర్థులను అప్లికేషన్ ఇవ్వడం జరిగిందని అధికారులు అదనపు కలెక్టర్ దృష్టికి తిసుకోచారు. అభ్యర్థు లకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూడాలని సూచించారు. శనివారం ఉదయం 10గం౹౹లనుండి సాయంత్రం 5 గం౹౹ ల వరకు శిక్షణ తరగతులు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. రేపు జరగబోయే ప్రారంభోత్సహ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు యస్ రాజేందర్ రెడ్డి, మక్తల్ కొడంగల్ శాసన సభ్యులు రామ్మోహన్ రెడ్డి నరేందర్ రెడ్డి గారు విచేస్తున్నారని తెలిపారు .
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామచందర్ నాయక్, ఎస్సి డిఇఓ కన్యాకుమారి, చిటెం మెమోరియల్ డిగ్రికళాశాల ప్రిన్సిపాల్ వసంత, అధికారులు శివ , మహేశ్వరం తదితరులు పాల్గొన్నారు.