జిల్లాలో ఉన్న ప్రాథమిక పాటశాలల్లో, అంగన్వాడి కేంద్రాలలో ఉన్న పిల్లల ఆరోగ్య సమస్యలను గుర్తించి, వారికి సరిఅయిన వైద్యం అందించాలని, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

జిల్లాలో ఉన్న ప్రాథమిక పాటశాలల్లో, అంగన్వాడి కేంద్రాలలో ఉన్న పిల్లల ఆరోగ్య సమస్యలను గుర్తించి, వారికి సరిఅయిన వైద్యం అందించాలని,  జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

బుధవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు వైద్య అధికారులుతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పాటశాలల్లో, అంగన్వాడి కేంద్రాలలో సామ్- మామ్ ఉన్న పిల్లలను ఎలా గుర్తిస్తున్నారని , వారికి  ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఆర్.బి.ఎస్.కె టీం లు జిల్లాలో ఉన్న అన్ని పాటశాలలు, అంగన్వాడి కేంద్రాలను సందర్శించి, 2-19 సంవత్సరాలు లోపు ఉన్న పిల్లల ఆరోగ్యాన్ని పరీక్షించి, న్యుమోనియా, జ్వరం, వంటి జబ్బులు ఉంటే వారికి అక్కడే మాత్రలు అందించి  వైద్యం చేయాలని, తీవ్ర ఆరోగ్య సమస్యలు, గుండె జబ్బులు, కంటి జబ్బులు   ఉన్న పిల్లలను ఎన్.ఆర్.సి సెంటర్ లకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. పాటశాల మరియు మండలం వారిగా ఆనారోగ్యంగా ఉన్న పిల్లలకు అందించే వైద్యం పై ప్రణాళిక  తయారు చేసి సబ్మిట్ చేయాలనీ అధికారులకు ఆదేశించారు.

జిల్లాలో హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ల  నిర్మాణ పనులు  ఎంతవరకు పూర్తి అయ్యాయని  అడిగి తెలుసుకున్నారు. కాంట్రాక్టర్ లతో మాట్లాడి వీలైనంత త్వరగా పనులు పూర్తి అయ్యేలా చూడాలని, ఎవైన సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించుకొని పనులు ప్రారంభించాలని అన్నారు. టి.బి మైక్రోస్కోపిక్ సెంటర్ నిర్మాణం కోసం ఎస్టిమేట్ తయారు చేసి సబ్మిట్ చేయాలనీ అన్నారు. జిల్లా లో నడుపుతున్న (104) 3 అంబులెన్స్ వాహనాలు మండలం వారిగా అన్ని గ్రామలలో తిరగాలని, వాహనాలు రోజు వారిగా నిర్వహించిన విధుల ఫోటో లను గ్రూప్ లో అప్లోడ్ చేయాలనీ తెలిపారు. సిబ్బంది కొరత ఉంటే వెంటనే రిక్రూట్మెంట్ చేసుకోవాలని, రెగ్యులర్ మరియు కాంట్రాక్టు పద్ధతి లో పని చేస్తున్న సిబ్బంది వివరాలను సబ్మిట్ చేయాలనీ అన్నారు.

వాక్సినేషన్ ప్రక్రియ ను నిరంతరంగా కొనసాగించాలని, ఆశాలు , ఎ.ఎన్.ఎం  లు ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి వాక్సిన్ వేసి గ్రామాలలో  వంద శాతం వాక్సినేషన్ అయ్యేటట్లు చూడాలని అధికారులకు ఆదేశించారు.

సమావేశం లో అదనపు కలెక్టర్ శ్రీ హర్ష, జిల్లా వైద్యాధికారి చందు నాయక్, టి.ఎస్.ఎం.ఐ.డి.సి రాఘవ, డాక్టర్ శశి కళ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

————————————————————————–

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే జారీ చేయడమైనది.

 

Share This Post