జిల్లాలో ఉపాధి హామీ పనుల‌ను ముమ్మరంగా చేపట్టాల‌ని జిల్లా కలెక్టర్‌ రాజివ్ గాంధి హనుమంతు అన్నారు.

బుధవారం నాడు కలెక్టరేట్‌ నుండి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధి హనుమంతు ,ఎంపిడివో లు‌,ఎమ్మార్వో లు పంచాయతీ కార్యదర్శుల‌తో కలక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో జాబ్‌ కార్డ్‌ ఉన్న ప్రతి వ్యక్తికి పని కల్పించాల‌ని సూచించారు. గ్రామాల్లోని ప్రభుత్వ ఖాళీ స్థలాల‌ను గుర్తించి వచ్చే హరితహారంలో అక్కడ మొక్కల‌ను నాటాల‌ని కోరారు. ప్రతి గ్రామంలో కూలీల‌ సంఖ్య పెంచి పనులు చేపట్టాల‌ని పేర్కొన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పనుల ప్రగతిని ప్రతి రోజూ పర్యవేక్షీంచాలనీ ఆదేశించారు
గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్మాణ పనులు సమర్దవంతంగా చేపట్టాల‌ని సూచించారు.

ఈ వీడియోకాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీఓ శ్రీనివాసుకుమార్, డిపిఓ జగదీశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post