జిల్లాలో ఉపాధ్యాయ అర్హత (టెట్) పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి – అదనపు కలెక్టర్ మోతిలాల్

జిల్లాలో జూన్‌ 12న నిర్వహించే టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ రెవిన్యూ యస్. మోతిలాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో టెట్ పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి, సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ అర్హత
పరీక్షల నిర్వహణలో భాగంగా అన్ని పరీక్షాకేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. జిల్లాలో టెట్‌కు మున్సిపాలిటీలో నాగర్ కర్నూల్ లో 18 కేంద్రాలు, అచ్చంపేట లో 11 కేంద్రాలు కల్వకుర్తి లో 12 కేంద్రాలు కొల్లాపూర్ లో 06 కేంద్రాల్లో ఉదయం 9:30 నుండి 12:00 గంటల వరకు పేపర్ 1 నిర్వహించనున్న ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయ అర్హత కు 47కేంద్రాల్లో నిర్వహించే పరీక్షకు 11,216 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న స్కూల్ అసిస్టెంట్ అర్హతకు పేపర్ 2 కు 4 మున్సిపాలిటీల్లో 37 కేంద్రాల్లో 8495 మంది అభ్యర్థులు పరీక్షలు పకడ్బందీగా రాసేలా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.
టెట్‌ పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
47 మంది చీప్ సూపరింటెండెంట్,47 డిపార్ట్మెంటల్ అధికారుల నియమించినట్లు వెల్లడించారు. పరీక్షల నిర్వహణకోసం నియమించిన అధికారులు, సిబ్బంది నిబద్దతతో పని చేయాలన్నారు.
పరీక్షల సమయంలో 144 సెక్షన్ పగడ్బందీగా అమలు అయ్యేలా చూడాలన్నారు. జిరాక్స్ లను మూసి ఉంచేలా చూడాలి అన్నారు.
ఈ సమావేశంలో డీఈవో గోవిందరాజులు,జిల్లా కోశాధికారి లక్ష్మీనారాయణ, ఆర్టీవో ఎర్రి స్వామి, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసులు, ఏసీ రాజశేఖర్ రావు,
టెట్ నిర్వహణ అధికారులు రవి యాదవ్, వెంకట్ నాలుగు మున్సిపాలిటీల మున్సిపల్ కమిషనర్లు ఆర్టీసీ వైద్య ఆరోగ్య విద్యుత్ పోలీస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share This Post