జిల్లాలో ఎత్తుకు తగ్గ బరువు లేని స్యామ్ మ్యామ్ పిల్లలను పకడ్బందిగా గుర్తించి రెండు నెలల లోపు వారిని ఆరోగ్యకరమైన స్థితికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలనీ లేని పక్షంలో చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి జిల్లా సంక్షేమ శాఖ సి.డి.పి.ఓ లు, సుపర్వైజర్లను ఆదేశించారు

జిల్లాలో ఎత్తుకు తగ్గ బరువు లేని స్యామ్ మ్యామ్ పిల్లలను పకడ్బందిగా గుర్తించి రెండు నెలల లోపు వారిని ఆరోగ్యకరమైన స్థితికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలనీ లేని పక్షంలో చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి జిల్లా సంక్షేమ శాఖ సి.డి.పి.ఓ లు, సుపర్వైజర్లను ఆదేశించారు.  సోమవారం కలేక్టరేట్ సమావేశ హాల్లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్యామ్ మ్యామ్ పిల్లల పై సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్, 2021 మాసంలో ఉన్న రిపోర్టు కు, నవంబర్, 2021 మాసపు రిపోర్టుకు పెద్దగా తేడా ఏమి లేదని,  తక్కువ బరువు ఉన్న పిల్లలు, ఎత్తుకు తగ్గ బరువు లేనివారు, వయస్సుకు తగ్గ ఎత్తు లేని పిల్లలు జిల్లాలో చాల మంది ఉన్నారని, సి.డి.పి.ఓ లు  పర్యవేక్షణ అధికారులు ఎంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.  మూడు నెలల కిందటే సరియైన పర్యవేక్షణ చేసి వస్సుకు తగ్గ బరువు లేని పిల్లల పై ప్రత్యెక శ్రద్ధ పెట్టి సుపెర్వైజరి ఫీడింగ్ ఇవ్వాల్సిందిగా ఆదేశించడం జరిగిందని, అయినప్పటికీ తక్కువ బరువు కలిగిన పిల్లల శాతం ఏమాత్రం తగ్గలేదని అధికారులపై  అసహనం వ్యక్తం చేసారు.  ఇదేవిధంగా పని చేస్తే సస్పెండ్ చేసి ఇంటికి పంపించడం జరుగుతుందని హెచ్చరించారు.  డిసెంబర్ మాసపు రిపోర్టు ఇప్పటివరకు తీసుకోకపోవడం పై ప్రశ్నించారు.  ఇంత నిర్లక్ష్యంగా ఉండటం ఏమిటని సి.డి.పి.ఓ లను ప్రశ్నించారు.  అంగన్వాడిలలో గుర్తించిన తక్కువ బరువు కల్గిన  పిల్లలకు సరియైన పౌష్టికాహారం టీచర్లు దగ్గరుండి తినిపించే విదంగా చూడాలని, రెండు నెలల్లో పిల్లలు సాధారణ స్థాయికి తీసుకువచ్చె విధంగా చర్యలు తీసుకోవాలని సుపెర్వైజర్లను ఆదేశించారు.  అంగన్వాడి కేంద్రాలపై పూర్తి పర్యవేక్షణ ఉండాలని ఇక నుండి  సుపెర్వైజర్లు ప్రతిరోజూ ఎ సెంటరు పర్యవేక్షణకు   వెళుతున్నారు ఎక్కడ ఉన్నారో మొబాయిల్  యాప్  ద్వారా

స్వయంగా  పర్యవేక్షించడం జరుగుతుందని తెలియజేసారు.  పిల్లల పట్ల అంకిత భావంతో పని చేయాలని, నిర్లక్షం వహిస్తే కటిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ సమావేశంలో డి.డబ్లు.ఓ వేణుగోపాల్, సి,డి.పి.ఓ లు, సుపెర్వైజర్లు తదితరలు పాల్గొన్నారు.

Share This Post