పత్రిక ప్రకటన–1 తేదీ : 18–09–2021
========================================
ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా రూపొందించాలి
లాజికల్ పొరపాట్లు, డెమోగ్రాఫికల్ పొరపాల్లను పూర్తిస్థాయిలో సవరించాలి
వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్గోయల్
జిల్లాలో ఓటరు నమోదుకు అన్ని రకాల చర్యలు : జిల్లా కలెక్టర్ హరీశ్
ఓటరు జాబితాను రూపొందించే క్రమంలో ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా పకడ్భందీగా రూపొందించాలని ఈ విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్గోయల్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్లో హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతూ ప్రతియేడు మాదిరిగానే 2022 సంవత్సరంలో రూపొందించే తుది ఓటరు జాబితాను ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా చూడాలని అన్నారు. ప్రస్తుతం కొత్తగా రూపొందించే ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు జరగకుండా చూడాలని అన్నారు. అలాగే కొత్తగా ఓటరుగా నమోదు అయ్యేందుకు సమర్పించిన ఫారాలు, మార్పులు, చేర్పులకు సంబంధించిన పత్రాలను పరిశీలించి చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా వివరించారు. దీనిలో భాగంగా ఓటర్ల జాబితాలో ఉన్న లాజికల్ పొరపాట్లు, డెమో గ్రాఫికల్ పొరపాట్లను పూర్తి స్థాయిలో సవరించాలని శశాంక్గోయల్ అధికారులను ఆదేశించారు. అలాగే ఓటరు జాబితా తయారీ కార్యక్రమానికి ముందస్తుగా ఆగస్టు 9, 2021 నుంచి అక్టోబర్ 31,2021 వరకు ప్రీ రివిజన్ కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. అనంతరం నవంబర్ 1, 2021 న ముసాయదా ఓటరు జాబితా విడుదల అవుతుందని నవంబర్ 30, 2021 వరకు ఓటరు జాబితాలపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరంచాలని, శని, ఆదివారాలు ప్రత్యేక క్యాంపును నిర్వహించి డిసెంబర్ 20, 2021లోగా అభ్యంతరాలను , ఓటర్ క్లెయిమ్స్ ను పూర్తి స్థాయిలో పరిష్కరించి, జనవరి 5, 2022 వ తేదీ వరకు తుది ఓటరు జాబితా రూపొందించాలని స్పష్టం చేశారు. ఓటర్ల నమోదు తదితర ప్రక్రియ నిరంతరమైందని ఓటర్ల నమోదుకు జనవరి 1, 2022 ప్రామాణికంగా తీసుకుని అప్పటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని శశాంక్గోయల్ అన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 2,500 దరఖాస్తులను పరిశీలించి వారం రోజుల్లోగా పరిష్కరిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్కు తెలిపారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 18 సంవత్సాలు నిండిన యువతీ యువకులను ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసి ఓటర్లుగా చేర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో మేడ్చల్ – మల్కాజిగిరి డీఆర్వో లింగ్యానాయక్, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.