జిల్లాలో ఓటర్ల నమోదు, సవరణ, మార్పుల ప్రక్రియ వేగవంతం వీడియో కాన్ఫరెన్స్లో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్,

పత్రిక ప్రకటన–1 తేదీ : 17–05–2022
============================================
జిల్లాల్లో పెండింగ్ ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు వెంటనే పరిష్కరించాలి,కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్.
రాష్ట్రంలోని పెండింగ్లో ఉన్న ఓటర్ నమోదు, మార్పులు, చేర్పుల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఓటర్ల దరఖాస్తులు, ఓటర్ జాబితాలో రెండు చోట్ల ఫొటోలు ఉండటం రెండు చోట్ల ఓట్లు కలిగి ఉండటం వంటి వాటిని వెంటనే తొలగించి ఒకే దక్కర ఓటు హక్కు కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ముప్పై రోజుల పైబడి పెండింగ్లో ఉన్న ఓటర్ నమోదు, మార్పులు, చేర్పుల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
జిల్లాలో ఓటర్ల నమోదు, సవరణ, మార్పుల ప్రక్రియ వేగవంతం
వీడియో కాన్ఫరెన్స్లో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ఓటర్ల నమోదు, సవరణలు, మార్పులు, చేర్పుల ప్రక్రియను వేగవంతంగా చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్ లో తన ఛాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఫొటో సిమిలర్ ఎంట్రీలు పూర్తి కావచ్చాయని తెలిపారు. అలాగే జిల్లాలో ఓటర్ల జాబితాలో ఏమైనా పొరపాట్లు, లాజికల్ పొరపాట్లు ఉన్నట్లయితే వాటిని పూర్తిస్థాయిలో సవరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పక్కా ప్రణాళిక ప్రకారం ఓటరు జాబితాను సిద్దం చేయనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ కార్యక్రమాన్ని పకడ్భందీగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జాబితాలో ఒకే ఓటర్ ఫోటోలు, వివరాలు రెండుమార్లు ప్రచురించిన వాటిని పరిశీలించి తొలిగిస్తున్నాము అని తెలిపినారు జిల్లా వ్యాప్తంగా ఓటర్ల తుది జాబితాను కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు పకడ్భందీగా ఉండేలా అధికారులు, సిబ్బందితో పనులు జరుగుతున్నాయని ఏమాత్రం లోపాలకు తావులేకుండా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ హరీశ్ వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఆర్డీవో రవి, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, ఎన్నికల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post