పత్రికాప్రకటన..3 తేదిః 12-10-2021
జిల్లాలో కన్నుల పండుగగా బతుకమ్మ పండుగ వేడుకల కార్యక్రమాలు

జగిత్యాల, అక్టోబర్12: తెలంగాణ ఖ్యాతిని సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తు నిర్వహించుకుంటున్న బతుకమ్మ పండుగ వేడుకలను జిల్లాలో జిల్లా పరిషత్ మరియు జగిత్యాల మున్సిపాలిటి శాఖల అద్వర్యం లో వేరువేరుగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మొదటగా జిల్లా పరిషత్ కార్యాలయ అవరణలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ అద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖా మాత్యుల సతీమణి శ్రీమతి కొప్పుల స్నేహలత, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత, జిల్లా కలెక్టర్ జి. రవి దంపతులు, కోరుట్ల శాసన సభ్యులు కె. విద్యాసాగర్ రావు దంపతులు. చొప్పదండి శాసన సభ్యుల సతిమణి మరియు జగిత్యాల ఆర్డీఓ శ్రీమతి ఆర్.డి. మాధురితో పాటు జట్పిటిసిలు,యంపిపిలు, ఉద్యోగులతో అంగరంగ వైబవంగా నిర్వహిరచుకోవడం జరిగింది, ముందుగా జ్యోతిప్రజ్వలనతో బతుకమ్మ పండుగ వేడుకల ను ప్రారంభించగా అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా కలెక్టర్ దంపతులు, కోరుట్ల శాసన సభ్యులు కూడా కార్యక్రమంలో పాలుపంచుకొని బతుకమ్మ ఆటలో ఉత్సహంగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత మాట్లాడుతూ, ఆడపచులు ఆడుతూ, పాడుతూ సంతోషంగా జరుపుకునే ఈ బతుకమ్మ పండుగను స్వదేశి మహిళలే కాకుండా విదేశి మహిళలు సైతం ఆడుతు తెలంగాణ ఖ్యాతిని సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయడం జరుగుతుందని పేర్కోన్నారు. తెలంగాణ సాదనలో బతుకమ్మ మరింత ప్రాచుర్యం పొందిందని, బతుకమ్మ పండుగను నిత్య జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను నెలవుగా రంగురంగుల పూలను కలబోసిన తయారు చేసే బతుకమ్మ పండుగలో మహిళలు ఎంతో ఉత్సాహంతో పాల్గోంటారని, సద్దుల బతుకమ్మ సంస్కృతి కేవలం తెలంగాణకు మాత్రమే దక్కుతుందని, దేవున్ని పూజించే పూలతో భక్తిశ్రద్దలతో బతుకమ్మగా మలుచుకొని ఆడుకునే బతుకమ్మ ఆటను ప్రతిఒక్కరు సంతోషంగా జరుపుకోవాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ జి. రవి మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ సందర్బంగా కార్యక్రమానికి హజరైన ప్రజాప్రతినిధులు, ఉద్యోగులకు సద్దులబతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. బతుకమ్మ కార్యక్రమంలో పాల్గోనడం చాలా సంతోషాన్నిచ్చిందని, బతుకునిచ్చే బతుకమ్మ పండుగ మంచి బతుకు, భవిష్యత్తును ఇవ్వాలని కోరుకుంటు బతుకమ్మ పండుగను నిర్వహించుకోవడం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాముఖ్యాన్ని, ప్రాచుర్యం గావించిన బతుకమ్మ పండుగను ప్రార్దించుకుంటు 9రోజులు పండుగను నిర్వహించుకుంటామని, సాంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగను తెలంగాణ ఉద్యమ సమయంలో, రాష్ట్ర సాధన అనంతరం రాష్ట్ర ప్రభుత్వమే పండుగ ప్రాముఖ్యత వచ్చే తరాలకు తెలిసేలా అందరికి తెలిసేలా పండుగను నిర్వహిస్తుందని తెలిపారు.
కోరుట్ల శాసన సభ్యులు కె. విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ సందర్బంగా కార్యక్రమానికి హజరైన మహిళాలలకు శుభాకాంక్షలను తెలియజేశారు. బతుకమ్మను అందరి దేవతని, మహిళలు ఈ పండుగరోజు పోటిపడుతూ బతుకమ్మను పేర్చుకుని, ఆటలు ఆడుకొని, నిమజ్జనం చేస్తారని, మహిళతో పాటు మగవాళ్లు కూడా పోటిపడి మరి బతుకమ్మ ఆటలు ఆడుతుండటంతో మరింత ప్రాచుర్యం సంతరించుకుందని అన్నారు.
అనంతరం జగిత్యాల మున్సిపాలిటీ అద్వర్యంలో 16ఫీట్లతో కూడిన బారిబతుకమ్మతో వైశ్యాభవన్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు శోభాయాత్రను నిర్వహించారు. అనంతరం బతుకమ్మ ఆటను అడుతు జగిత్యాల జిల్లాకేంద్రంలో ముందుగానే సద్దుల బతుకమ్మ పండుగ వచ్చిందా అనేవిధంగా జిల్లా నలుమూల పండుగ వాతావరణం సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ ఛైర్పెర్సన్ భోగ శ్రావణి, మున్సిపల్ కమిషనర్ , జగిత్యాల ఆర్డిఓ శ్రీమతి అర్.డి. మాదురితొ పాటు పలువులు ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, ఉద్యోగులు, అధికారులు పాల్గోన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం జగిత్యాల చే జారిచేయనైనది.