జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం 100% పూర్తిచేయాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వైద్య శాఖ అధికారులకు ఆదేశించారు

జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్  స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం  100% పూర్తిచేయాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.  వైద్య శాఖ అధికారులకు ఆదేశించారు.

బుదవారం కల్లెక్టరేట్   సమావేశం హాలు లో   వైద్యం  మరియు ఇర్రిగేషన్  అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో  పాల్గొన్న మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్  డ్రైవ్, సీజనల్ వ్యాధులు, ప్రబలకుండా , ప్రాజెక్టు పనులలో ఎలాంటి అలసత్వం వహించకుండా సమస్యలను సత్వరమే పరిష్కరించే విదంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. జిల్లా లోని మున్సిపాలిటీలలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 4 లక్షల 22 వేలు వ్యాక్సినేషన్  టార్గెట్ ఉందని, ఇప్పటివరకు 2 లక్షల 12 వేలు పూర్తయిందని, స్పెషల్ డ్రైవ్ ద్వారా మొత్తం 1 లక్ష 774 వాక్సినేషన్ పూర్తి అయిందని తెలిపారు.

ప్రభుత్వానికి ప్రజలకు మద్యన వారదిగా ఉండి ,వ్యాక్సినేషన్ తక్కువ ఉన్న మండల కేంద్రాలలో సాంస్కృతిక కళాకారులతో ప్రజలకు టీకా వేసుకునే విధంగా అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిపిఆర్ఓ కు ఆదేశించారు.

జూరాల,నెట్టెం పాడు, తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇర్రిగేషన్ రిజర్వాయర్లకు డి.పి.ఆర్ రెడీ చేసుకొని మీ పరిధిలో చేయాల్సిన పనులు ఎమ్మెల్యే తో మాట్లాడి పూర్తి చేయాలని అన్నారు. అధికారులు సైటుకు వెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా ముందుకేల్లాలని , ఎ.ఈ.ఓ. లు వారి పరిధి లో ఉన్న కాల్వలను చెక్ చేసి మరమ్మతులు చేయించాలని, రైతులు పండించే పంటలకు నీళ్లు అందుబాటులో ఉండేవిధంగా దృష్టి పెట్టాలని తెలిపారు. జూరాల ప్రాజెక్ట్ పై దుమ్ము ధూళి, కంప చెట్లు తొలగించడం, సానిటేషన్ 15 రోజులకు ఒకసారి సిబ్బందినిపెట్టి  శుబ్రం చేయించాలని అధికారులకు ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి  మాట్లాడుతూ సూచనల ప్రకారము జిల్లాలో వంద శాతం వాక్సినేషన్ పూర్తి అయ్యేటట్లు చూస్తామని, ఇరిగేషన్ అధికారులతో ప్రతి వారానికి ఒకసారి రివ్యూ చేస్తామని, పనులు అమలు అయ్యేటట్లు చూస్తామని తెలిపారు.

సమావేశం లో ఎంపీ పోతుగంటి రాములు, జిల్లా జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అల్లంపూర్ శాసనసభ్యులు డా.అబ్రహం, అదనపు కల్లెక్టర్లు రఘురామ్ శర్మ, శ్రీ హర్ష, వైద్య అధికారి చందు నాయక్, గ్రంథాలయ చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి,  మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ వెంకటేష్. కరుణ సూరి. ఐజ మున్సిపాలిటీ చైర్మన్ చిన్న దేవన్న.  ఇరిగేషన్ సి.ఇ రఘునాథ్ రావు, శ్రీనివాస్ రావు, ఇ ఇ లు , జుబెర్, రహీముద్దీన్ , తదితరులు పాల్గొన్నారు…

Share This Post