జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ లక్ష్యాలను ప్రణాళికా బద్ధంగా పూర్తి చేయ్యాలి- జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

 

జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ లక్ష్యాలను ప్రణాళికా బద్ధంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ, వైద్యారొగ్య శాఖ పనితీరు వంటి అంశాల పై  గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలోకలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో 627625 మందికి వ్యాక్సినేషన్ అందించాల్సి ఉండగా ఇప్పటివరకు దాదాపు 541337 (86%) మందికి మొదటి డోసు, 155389 (29%) మందికి రెండో వ్యాక్సినేషన్ పూర్తి చేశామని అధికారులు వివరించారు. మిగిలిన వారు 86288 మంది ఉన్నారని తెలిపారు.
జిల్లాలో జరుగుతున్న వ్యాక్సినేషన్ పురోగతి పై కలెక్టర్ పి.హెచ్.సి వారిగా రివ్యూ తీసుకున్నారు.
జిల్లాలో ఇతర ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ తీసుకున్న ప్రజల వివరాలు, వ్యాక్సినేషన్ తిరస్కరిస్తున్న వారి వివరాలను గ్రామాల వారిగా అందించాలని కలెక్టర్ తెలిపారు
వ్యాక్సినేషన్ విజయవంతం అయ్యేలా ఎఎన్ఎం, ఆశా కార్యకర్తలు సమన్వయం చేసుకోవాలని సూచించారు.
జిల్లాలో చాలామంది 2వ డోస్ వ్యాక్సినేషన్ సమయం గడిచినప్పటికీ పెండింగ్ ఉందని, దీని పూర్తి చేసేందుకు మెడికల్ అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు
జిల్లాలోని క్షేత్ర స్థాయిలో వ్యాక్సినేషన్ పూర్తి చేయడంలో కలుగుతున్న అవరోధాల గురించి కలెక్టర్ ఆరా తీశారు.
అపోహల కారణంగా కొంతమంది వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రాకపోవడం గమనించిన కలెక్టర్, ప్రజాప్రతినిధుల సహకారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజలంతా ముందుకు వచ్చి వ్యక్తిని తీసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు
ప్రభుత్వ వైద్య రంగం పై నమ్మకం కలిగే విధంగా మెడికల్ అధికారులు విధులు నిర్వహించాలని , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణలో జవాబుదారీతనం ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లాలో ఉన్న ప్రాథమిక ఆరొగ్య కేంద్రాలు, కమ్యూనిటి హెల్త్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు.
ప్రాథమిక ఆరొగ్య కేంద్రంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, ప్రాథమిక ఆరొగ్య కేంద్రాలో ఓపీల సంఖ్య పెరగాలని పేర్కోన్నారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో ఇన్ పేషెంట్ సామర్థ్యం , వాటి వినియోగం పరిశీలించాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు సక్రమంగా అందించాలని ఆదేశించారు.
జిల్లా ఆస్పత్రిలో అభివృద్ధి కమిటీ ని ఏర్పాటు చేసి ప్రతి మూడు మాసాలకు ఒకసారి క్రమం తప్పకుండా సమావేశపరచాలని ఆదేశించారు.
ఆస్పత్రిలో డాక్టర్ల ఫోన్ నెంబర్లు రోగులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
ఆసుపత్రికి వచ్చే గర్భిణీల ప్రసవాల ముందస్తు తేదీలు సూచిక బోర్డు పై రాశి ఉంచాలని గర్భిణీలకు ఒక నెల ముందు నుంచే జాగ్రత్తలు సూచిస్తూ సుఖమైన ప్రసవాలకు చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని, వీటి కోసం ఆసుపత్రి నిధులు, ఆరొగ్య శ్రీ నిధులు, ఆసుపత్రి వద్ద ఉన్న నిధులున వినియోగించాలని ఆదేశించారు.
ఆసుపత్రి ప్రాంగణంలో పిచ్చి మొక్కలు, అపరిశుభ్రత ఉండకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఆసుపత్రి ప్రాంగణంలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ఆసుపత్రులను జిల్లా స్థాయి అధికారుల నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వరకు ఎవరైనా ఆకస్మికంగా తనిఖీ చేస్తారని, వైద్యులు సకాలంలో అందుబబాటులో లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేసారు.
ప్రజలతో వైద్యశాఖ సిబ్బంది ప్రవర్తించే తీరులో మార్పు రావాలని, చిరునవ్వుతో రోగులకు వైద్యం చేయాలని సూచించారు.
అదనపు కలెక్టర్ మను చౌదరి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధాకర్ లాల్, జిల్లా ఇమ్యూనైజేషన్ అదికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి, ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శివరాం వైద్యులు, మెడికల్ అధికారులు, సంబంధిత అధికారులు తదతరులు ఈ సమీక్షలో పాల్గోన్నారు

Share This Post