జిల్లాలో కస్టo మిల్లింగ్ రైస్ ను డిసెంబర్ 31 లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు.

మంగళవారం నాడు కలక్టర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కస్టం మిల్లింగ్ రైస్, 2020-21 యాసంగి పంట సంబంధిత అంశాల పై అధికారులు, రైస్ మిల్లర్లతొ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ రైస్ మిల్లర్లు ప్రభుత్వం లక్ష్యాలకనుగుణంగా పని చేయాలనీ అన్నారు. ఈ యాసంగి సీజన్ 2020-21కి సంబంధించి కస్టo మిల్లింగ్ రైస్ ను ఇప్పటి వరకు 2 లక్షల 39 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టo మిల్లింగ్ కొరకు 39 రైస్ మిల్లులకు పంపిణి చేయడం జరిగినదని తెలిపారు. ఇందుకుగాను 104539 మెట్రిక్ టన్నులు బియ్యం డెలివెరి చేసినారు, ఇంకానూ మిల్లుల నుండి 58 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లుల నుండి రావాల్సి వున్నదని తెలిపారు.
ధాన్య సేకరణలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ సిబ్బంది, రైస్ మిల్లర్లు, ఎఫ్.సి.ఐ అధికారులు సమన్వయంతో పనిచేసి సీఎంఆర్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో రైస్ మిల్లులు 24 గంటలు పని చేయాలని ఆదేశించారు. జిల్లాలో రైస్ మిల్లు అందించే సీఎంఆర్ రైస్ ను భద్రపరిచేందుకు వీలుగా గోడౌన్లలో స్థలం ఏర్పాటు , హమాలీల కొరత లేకుండా చేయాలని కలెక్టర్ తెలిపారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైస్ మిల్లర్లు ధాన్యంలో కోత విధించకూడదని అన్నారు. కొనుగోలు కేంద్రాల నుండి లారీల ద్వారా కేటాయించిన రైస్ మిల్లులకు పంపించిన ధాన్యాన్ని వెంటనే దించుకోవాలని రైస్ మిల్లర్లకు ఆయన సూచించారు . ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు సందర్భంలో రైతుల వివరాలు ఆన్ లైన్లో నమోదు చేసినపుడు ఎదురౌతున్న సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరీక్షిoచాలని అధికారులను కలెక్టర్ సూచించారు,
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డియస్ ఓ వసంత లక్ష్మీ,
డి. ఎం. సివిల్ సప్లయ్ కృష్ణ వేణీ, రైస్ మిల్లర్లు , తదితరులు పాల్గొన్నారు.

Share This Post