జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎటువంటి ఆస్థి, ప్రాణ నష్టం సంభవించకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు.

ప్రచురణార్ధం

ఆగష్టు 31 ఖమ్మం:

జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎటువంటి ఆస్థి, ప్రాణ నష్టం సంభవించకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. వరద సహాయక చర్యల నిమిత్తం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్  ఏర్పాటు చేయడం జరిగిందని “ 9063211298 ” నెంబరుకు వరద సహాయక చర్యల సమాచారాన్ని తెలిపిన సత్వరమే సహాయక చర్యలు అందించడం జరుగుతుందని దీనితో పాటు “1077 ” టోల్ ఫ్రీ నెంబరు కూడా అందుబాటులో ఉంటుందని వరద సహాయక చర్యల నిమిత్తం ప్రజలు ఎటువంటి సమాచారాన్నయిన ప్రత్యేక కంట్రోల్ రూమ్క తెలియపర్చవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎటువంటి ఆస్థి, ప్రాణ నష్టం సంభవించలేదని నీటి పారుదల, రోడ్లు భవనాలు, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ యంత్రాంగంతో పాటు మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దారులు, ఎం.పి.డి.ఓలు వరద నివారణ ముందస్తు చర్యల్లో నిమగ్నమై ఉన్నారని జిల్లా. అధికారులతో పాటు మండల స్థాయి అధికారులందరూ వారి వారి కార్య స్థానాల్లో ఉంచడం జరిగిందని. కలెక్టర్ తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని పొంగే వాగులు, వంతెనలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని, మత్సకారులు వేటకు వెళ్ళరాదని, వాహనదారులు వర్షాల సమయంలో ప్రయాణాలు మానుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు..

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post