జిల్లాలో కొత్తగా మంజూరు ఆయిన నర్సింగ్, మెడికల్ కళాశాల భవన నిర్మాణం పనులు డిసెంబర్ 15 లోగా పూర్తి చేసి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ఆర్ అండ్ బి అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు

జిల్లాలో  కొత్తగా మంజూరు ఆయిన నర్సింగ్, మెడికల్ కళాశాల భవన నిర్మాణం పనులు డిసెంబర్ 15 లోగా పూర్తి చేసి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ఆర్ అండ్ బి అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు.  సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ హాల్లొ స్థానిక శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి, అదనపు కలెక్టర్ మను చౌదరి తో కలిసి నిర్మాణ పనుల పై అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సకాలంలో నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన మెటీరియల్ అడ్వాన్సుగా సమకూర్చుకోవాలని సూచించారు.  పని చేసే లేబర్ ను రెట్టింపు చేయాలని, మిషనరీ మెటీరియల్ కు ఇబ్బందులు రాకుండా సమకూర్చుకోవలన్నారు.   రోజువారీ ప్రగతి నివేదిక ఇవ్వాలని ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే తనకు తెలియజేయాల్సిందిగా ఆదేశించారు.  ప్రభుత్వ ఆసుపత్రి పడకల పెంపు కై నిర్మిస్తున్న అదనపు నిర్మాణం సైతం డిసెంబర్ 15 నాటికి విద్యుత్, ఫర్నిచర్ తో సహా పూర్తి చేసి అప్పగించాల్సిందిగా ఆదేశించారు.  డెక్ షీట్ల తయారీ ట్రెస్ లను సకాలంలో తయారు చేసి బిగించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.  ప్లిన్త్ భీమ్ లు పూర్తి అయిన వెంటనే స్టీల్ బాక్స్ పిల్లర్లు, రెడీమేడ్ గా తయారు చేసి ఉంచిన ట్రెస్ షీట్లను బిగించే విధంగా చూడాలన్నారు. 24 గంటలు 3 షిఫ్ట్ లలో పని చేసి నిర్మాణం గడువు లోపల పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో ఈ. ఈ ఆర్.అండ్ బి భాస్కర్, ఆసుపత్రి సూపరిండెంట్ డా. శివరాం, డి. ఈ.సి ఇండస్ట్రీస్ ప్రతినిధి మధుసూదన్,  టి.ఎస్.ఎం.ఐ.డి.సి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post