. వృద్దాప్య పింఛన్లు కొరకు 57 ఏళ్లు నిండిన వారి నుంచి పింఛన్ల దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 11వ తేదీ సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు అర్హులు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు ఆయన వివరించారు. వృద్ధాప్య పింఛనుకు మీ సేవ కేంద్రాల్లో ఉచితంగా దరఖాస్తు చేసుకునే ఆవకాశం ప్రభుత్వం కల్పించిందని, కొరకు దరఖాస్తు దారులు నుండి ఎటువంటి రుసుము వసూలు చేయొద్దని, మీ సేవా కేంద్రాల నిర్వాహకులకు ప్రభుత్వమే రుసుము చెల్లింపు చేస్తుందని, ప్రభుత్వ నిబందనలు ఉల్లంఘించి ఎవరైనా వృద్ధాప్య పింఛను దరఖాస్తు దారుల నుండి రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని మీ సేవా కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ ఆదేశాలు పాటించు విదంగా చర్యలు చేపట్టాలని ఈడియం ను ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ననుసరించి 57 సంవత్సరాలు నిండిన వారు దరఖాస్తు చేయుటకు అర్హులని చెప్పారు. దరఖాస్తు చేయుటకు ఆధార్, ఎన్నికల గుర్తింపు కార్డు, ఆహార భద్రత కార్డు వెంట తెచ్చుకోవాలని, దరఖాస్తు తదుపరి ప్రింట్ కాపీని సంబంధిత ఎంపిడిఓ కార్యాలయంలో అందచేయాలని చెప్పారు.