జిల్లాలో కోవిడ్-19 పాజిటివ్ రేటును పూర్తిగా తగ్గించడంలో వైద్యాధికారుల ప్రమేయం మరింత పెరగాలని అనుబంధ శాఖల అధికారుల సమన్వయంతో నియంత్రణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ వైద్యాధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

ఆగష్టు 11 ఖమ్మం :

జిల్లాలో కోవిడ్-19 పాజిటివ్ రేటును పూర్తిగా తగ్గించడంలో వైద్యాధికారుల ప్రమేయం మరింత పెరగాలని అనుబంధ శాఖల అధికారుల సమన్వయంతో నియంత్రణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ నుండి మండల స్థాయి వైద్యాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కోవిడ్-19, డెంగ్యూ నియంత్రణ చర్యలు, నూతన సబ్: సెంటర్ల పనులు, తెలంగాణ డయగ్నస్టిక్ సెంటర్ ద్వారా రోగనిర్ధారణ పరీక్షలకై నమూనాల సేకరణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాల సంఖ్య పెంచడం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ పి.హెచ్.సిల వారీగా సమీక్షించి వైద్యాధికారులకు పలు సూచనలు, ఆదేశాలు చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రధానంగా గ్రామాలలో కోవిడ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు మెడికల్ ఆఫీసర్లు తమ విధులు మరింత బాధ్యతాయుతంగా నిర్వర్తించాల్సి ఉందని, పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న హైరిస్క్ ప్రాంతాలలో, పాజిటీవ్ పేషెంట్లను గుర్తించి ఐసోలేషన్ కేంద్రాలకు తరలించాలని, ప్రైమరీ కాంటాక్టులను గుర్తించి నిర్ధారణ పరీక్షలు జరపాలని, గ్రామాలలో 18 ఏండ్లు పైబడిన వారందరూ వ్యాక్సిన్ తీసుకునే విధంగా సత్వర చర్యలు ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వ్యాక్సినేషన్ దోసుల నిల్వలు ఉన్నప్పటికీ వ్యాక్సినేషన్ సంఖ్య తక్కువగా ఉందని, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతిరోజు ఐదు వందల వ్యాక్సినేషన్ తప్పనిసరిగా జరగాలని కలెక్టర్ ఆదేశించారు. కోవిడ్-19 వ్యాప్తిని జిల్లాలో పూర్తిగా అరికట్టేందుకు మండల స్థాయి టాస్క్ఫోర్స్ బృంధం స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో పాజిటీస్ పేషెంట్లను ఐసోలేషన్ కేంద్రాలకు తరలించేందుకు అవగాహన కల్పించి చైతన్య పర్చాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ తీసుకునే విధంగా అవగాహన పెంపొందించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఏ.ఎన్.ఎం. ఆశా వర్కర్ల వద్ద పల్స్ ఆక్సిమీటర్ తప్పనిసరిగా ఉండాలని, పాజిటివ్ పేషెంట్లు, ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తుల ఆరోగ్యపరిస్థితిని ప్రతిరోజు పరీక్షించాలని, కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో చేపడ్తున్న నూతన సబ్ సెంటర్ల నిర్వహణ పనుల ప్రక్రియను వేగవంతం చేసి మూడు నెలలోపు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పంచాయితీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ద్వారా జిల్లాలో నూతన సబ్ సెంటర్ల నిర్వహణ పనులు జరుగుతున్నాయని, మెడికల్ ఆఫీసర్లు, సంబంధిత అధికారుల సమన్వయంతో పనులు త్వరగా పూర్తయ్యేలా సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా డెంగ్యూ నియంత్రణ చర్యలు మరింత ముమ్మరం కావాలని, ప్రతి మంగళ, శుక్రవారం “డ్రై డే” కార్యక్రమాలు తప్పనిసరిగా జరగాలని, డెంగ్యూ కేసులు అధికంగా నమోదైన ప్రాంతాలలో ప్రత్యేక వైద్య శిభిరాలను ఏర్పాటు చేసి నిరంతరాయంగా వైద్యసేవలు అందించాలని, డెంగ్యూ వ్యాధి ప్రభలకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.

స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా॥మాలతి, జిల్లా సర్వేలెన్స్ అధికారి రాజేష్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి అలివేలు, జిల్లా మలేరియా అధికారి సంధ్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల మెడికల్ ఆఫీసర్లు, ప్రోగ్రాం అధికారులు తదితరులు వీడియో కాన్ఫరెన్స్లోలో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post