జిల్లాలో గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్

జిల్లాలో గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు

మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్​ హరీష్​

మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా  వ్యవసాయ క్షేత్రాలు, పంట పొలాల్లో గంజాయి సాగు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఈ విషయంలో ఎవరైనా గంజాయి సాగు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు  క్రిమినల్​ కేసులు నమోదు చేయడంతో పాటు వారికి ప్రభుత్వం నుంచి అందే పథకాలను నిలిపివేస్తామని జిల్లా కలెక్టర్​ హరీష్​ అన్నారు. సోమవారం కలెక్టరేట్​లోని సమావేశ మందిరంలో  మాట్లాడుతూ జిల్లాలో కొన్ని చోట్ల గంజాయి సాగు చేస్తున్నారని సమాచారం అందిందని ఈ విషయంలో కఠినంగా వ్యవహరించడంతో ఆబ్కారీ (ఎక్సైజ్​ ) శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని ఎక్కడైనా గంజాయి సాగు చేస్తున్నారని తెలిసినట్లయితే వెంటనే వారిపై క్రిమినల్​ కేసులు నమోదు చేసి వెంటనే బైండోవర్​ చేయాలని కలెక్టర్​ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఏమాత్రం వెనుకాడరాదని అలాగే గంజాయి సాగును అరికట్టడంతో పాటు దాడులు చేసే విషయంలో పోలీసు శాఖ  సహకారం కూడా తీసుకోవాలని కలెక్టర్​ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, ఆర్ డి ఓ ,రవి ,మల్లయ్య  ,జిల్లా వ్యవసాయాధికారిణి మేరీ రేఖ, డీహెచ్ఎస్వో సత్తార్, ఏడీ వెంకట్రామిరెడ్డి, వ్యవసాయ శాఖ, ఉద్యానవనశాఖ అధికారులతో పాటు ఆయా విత్తనాల డీలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు..

Share This Post