జిల్లాలో గణేశ నిమజ్జనాన్ని పురస్కరించుకుని శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా గణేష్ నిమజ్జనం జరుగే మునిసిపల్ ప్రాంతాలలో వైన్ షాపులు, బార్ షాపులు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలను మూసి వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు శనివారం నాడోక ప్రకటనలో తెలిపారు.

ఈనెల 19న నిర్వహించు
గణేష్ నిమజ్జనం సందర్భంగా సంగారెడ్డి ,సదాశివపేట, అమీన్పూర్, జహీరాబాద్ మునిసిపాలిటీల పరిధిలో ఈ నెల 19 న ఉదయం 6 గంటల నుండి 20 న ఉదయం 6 గంటల వరకువైన్ షాపులు, బార్ షాపులు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలను మూసివేస్తున్నట్లు ఆయన తెలిపారు.
నారాయణఖేడ్, జోగిపేట్ -అందోల్, పి.ఎస్ పటాన్చెరు పరిధి,
పి ఎస్. ఐడీఏ బొల్లారం మునిసిపాలిటీల పరిధిలో ఈ నెల 20 న ఉదయం 6 గంటల నుండి 21 న ఉదయం 6 గంటల వరకు మూసివేస్తున్నట్లు ఆయన తెలిపారు.
దుకాణదారులు ఎవరైనా ఆదేశాలు ఉల్లంఘించి షాపులు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు .

గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులకు, జిల్లా యంత్రాగానికీ సహకరించవలసినదిగా ఆయన కోరారు.

Share This Post