జిల్లాలో గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఆయా శాఖల అధికారులు ముందస్తు ప్రణాళికతో విజయవంతం చేయాలని జిల్లా ఎస్పి రమణ కుమార్ సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం ముందస్తు ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ రాజర్షి షా తో కలిసి రెవిన్యూ, పోలీస్, నీటిపారుదల, విద్యుత్, ఆర్ అండ్ బి, ఎక్సైజ్ , అగ్నిమాపక శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

పత్రికా ప్రకటన
సంగారెడ్డి, సెప్టెంబర్ 8:–

జిల్లాలో గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఆయా శాఖల అధికారులు ముందస్తు ప్రణాళికతో విజయవంతం చేయాలని జిల్లా ఎస్పి రమణ కుమార్ సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం ముందస్తు ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ రాజర్షి షా తో కలిసి రెవిన్యూ, పోలీస్, నీటిపారుదల, విద్యుత్, ఆర్ అండ్ బి, ఎక్సైజ్ , అగ్నిమాపక శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అంతటా వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. డివిజనల్ స్థాయి లో ఆర్ డి వో లు ,డీఎస్పీలు అనుబంధ శాఖల అధికారులు, మండపాల నిర్వాహకులతో సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు. మట్టి గణపతుల విగ్రహాలను ప్రోత్సహించాలన్నారు. మండపాలలో ఎత్తయిన పెద్ద విగ్రహాలు కాకుండా చిన్నవి, మీడియం సైజ్ విగ్రహాలు పెట్టేలా అవగాహన కల్పించాలన్నారు. మండపాల వద్ద ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారికి సూచించారు. నిమజ్జన పాయింట్ల వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని మత్స్య, నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు.

గణేష్ మండపాలకు తాత్కాలిక మీటర్లను ఏర్పాటు చేయడానికి విద్యుత్ అధికారులు చొరవ చూపాలన్నారు. వినాయక మండపాలను రోడ్డుకు అడ్డంగా, రోడ్డు మూసి వేసే విధంగా ,జాతీయ రహదారుల పై ఏర్పాటు చేయరాదన్నారు. మండప నిర్వాహకులు భక్తులకు ఇచ్చే ప్రసాదాలను తాజాగా తయారు చేసి ఇచ్చేలా చూడాలని ఫుడ్ ఇన్స్పెక్టర్ కు సూచించారు. మండపాలు అన్ని విధాల సురక్షితంగా ఉండేలా ఏర్పాటు చేయాలని, తాత్కాలిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని మండప నిర్వాహకులకు తెలపాలన్నారు.
మున్సిపల్ అధికారులు ప్రతి మండపాన్ని సందర్శించాలని సూచించారు.

ప్రజల వద్ద బలవంతంగా చందాలు వసూలు చేయరాదని ఎస్పీ స్పష్టం చేశారు. శాంతిభద్రతలు పటిష్టంగా అమలు అయ్యేలా చూడాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. ఒనరబుల్ పాయింట్స్ వద్ద నీటిపారుదల శాఖ జె ఈ, ఏ ఈ లను అందుబాటులో ఉంచాలని నీటిపారుదల శాఖ అధికారికి సూచించారు. నిమజ్జన ప్రాంతాలలో పూర్తిస్థాయి వెలుతురు ఉండేలా లైటింగ్ ఏర్పాటు చేయాలని నిమజ్జనానికి వెళ్లే గణేష్ ల దారిలో గల చెట్ల ను రోమింగ్ చేయాలని, చిన్న చిన్న రోడ్డు రిపేర్ లను చేయాలని, గుంతలు పూడ్చాలని ఆర్ అండ్ బీ శాఖ అధికారులకు సూచించారు. విగ్రహాల ఏర్పాటు సమాచారం తప్పనిసరిగా అందించాలన్నారు.

అదనపు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. మండపాల న్నింటిలోనూ కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. విగ్రహాలు వెళ్లేదారిలో లో- లైన్ విద్యుత్ తీగలను సరిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
నిమజ్జన స్థలాల్లో క్రేన్లు ఏర్పాటు చేయాలని, నిమజ్జనానికి ముందు తర్వాత పారిశుద్ధ్య నిర్వహణ సమర్థవంతంగా జరగాలని, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. క్రేన్ లలో ఎక్కువ మందిని అనుమతించవద్దని ,
ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలన్నారు. వినాయక మండపాల ఏర్పాటుకు ముందు ఏర్పాటు అయిన తర్వాత ప్రతి రోజు పారిశుద్ధ్య నిర్వహణ విధిగా జరగాలన్నారు. ఆయా శాఖల అధికారులు అందరూ తమ తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన కోరారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి రాధిక రమణి, నీటిపారుదల , విద్యుత్, ఆర్ అండ్ బి, అగ్నిమాపక, ఎక్సైజ్ శాఖల అధికారులు,డిఎస్పీలు, రెవిన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post