జిల్లాలో గణేష్ నిమజ్జన వేడుకలు శాంతియుత వాతావరణంలో, సజావుగు జరిగేలా అధికారులందరూ సమిష్టి బాధ్యతతో పనిచేయవలసినదిగా అదనపు కలెక్టర్లు రమేష్, ప్రతిమ సింగ్, అదనపు ఎస్పీ కృష్ణమూర్తి లు కోరారు

జిల్లాలో గణేష్ నిమజ్జన వేడుకలు శాంతియుత వాతావరణంలో, సజావుగు జరిగేలా అధికారులందరూ సమిష్టి బాధ్యతతో పనిచేయవలసినదిగా అదనపు కలెక్టర్లు రమేష్, ప్రతిమ సింగ్, అదనపు ఎస్పీ కృష్ణమూర్తి లు కోరారు

జిల్లాలో గణేష్ నిమజ్జన వేడుకలు శాంతియుత వాతావరణంలో, సజావుగు జరిగేలా అధికారులందరూ సమిష్టి బాధ్యతతో పనిచేయవలసినదిగా అదనపు కలెక్టర్లు రమేష్, ప్రతిమ సింగ్, అదనపు ఎస్పీ కృష్ణమూర్తి లు కోరారు. సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు సంబంధిత అధికారులతో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను సమీక్షిస్తూ జిల్లాలో ఈ సంవత్సరం 2,124 గణేష్ మండపాలు ఏర్పాటు చేశారని, ఈ నెల 16 నుండి 21 వరకు వివిధ రోజులలో గణేష్ నిమజ్జనం జరిగే అవకాశమున్నందున శోభా యాత్ర మొదలుకొని మొదటి విగ్రహం నుండి చివరి విగ్రహం నిమజ్జనం జరిగే వరకు ఎటువంటి చిన్న సంఘటనలు జరుగకుండా అధికారులందరూ అప్రమత్తం ఉండి దైవ కార్యంగా సమిష్టి భాద్యతగా పనిచేసి విజయవంతం చేయవలసినదిగా కోరారు. 5 ఫీట్ల లోపు 909 విగ్రహాలు, 6 ఫీట్ల పైన 1215 విగ్రహాలు ఉన్నాయని, నిమజ్జనం చేసేటప్పుడు ఎటువంటి విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మలు తగలకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. నిమ్మజన ప్రదేశాలలో, చెరువు కట్టలపై దేదీప్యమానముగా వెలిగే విధంగా లైటింగ్ ఏర్పాటు చేయుటకు అవసరమైన విద్యుత్ లైనింగ్, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని విద్యుత్ శాఖాధికారులకు సూచించారు. పట్టన ప్రాంతాల్లో మునిసిపల్ అధికారులు, గ్రామాలలో గ్రామా పంచాయితీలు లైటింగ్ ఏర్పాట్లు చూడాలని, అవసరమైతే జెనెరేటర్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. శోభాయాత్ర , నిమజ్జనం, ట్రాఫిక్ పట్ల ప్రజలను అప్రమత్తం చేయుటకు పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లాలో 42 సునిశిత ప్రాంతాలను గుర్తించామని కడు జాగ్రత్తతో వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు కొత్తగా ఏర్పాటుచేసిన వాట్స్ అప్ కు సమాచారమందిస్తూ కోవిడ్ నిబంధనలతో నిమజ్జనోత్సవాన్ని విజయవంతం చేయాలని వారు అధికారులకు సూచించారు.
ఈ సంవత్సరం భారీ వర్షాల కారణంగా చెరువులు, కుంటలు నిండుగా ఉన్నందున మెదక్ లోని కొంటూరు , నర్సాపూర్ లోని రాయన్ చెరువు, చేగుంట చెరువు, తూప్రాన్ చెరువు తదితర అవసరమైన ప్రాంతాలలో బ్యారీకేడింగ్ ఏర్పాటు చేయవలసినదిగా ఆర్ అండ్ బి ఈఈ కి సూచించారు. అదేవిధంగా అవసరమైన ప్రాంతాలలో క్రేన్లు ఏర్పాటు చేయడంతో పాటు డీజిలు, మెకానిక్, అదనపు డ్రైవర్ ను సమకూర్చుకోవాలన్నరు. పట్టణాలలో పెద్ద పెద్ద చెరువుల దగ్గర నలుగురికి తగ్గకుండా గజఈతగాళ్లను ఏర్పాటు చేయాలని, గ్రామాలలో మత్స్య సహకార సంఘాల ద్వారా అవసరమైన ప్రాంతాలలో గజఈతగాళ్లను ఏర్పాటు చేయాలని మత్స్య శాఖ సహాయ సంచాలకులకు సూచించారు. అలాగే ప్రథమచికిత్స అందించుటకు ఫస్ట్ ఎయిడ్, అంబులెన్సులు ఏర్పాటు చేయాలని డి ఏం అండ్ హెచ్ ఓ కు సూచించారు. వర్షాలు పడే అవకాశమున్నందున షామియానాలు, మంచినీటి సదుపాయం, దాతల సహకారంతో పులిహోర ప్యాకెట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. మండల కేంద్రాలు, గ్రామాలలో నిమజ్జనం కార్యక్రమం సజావుగా నిర్వహించుటకు తగు ఏర్పాట్లకై తహశీల్ధార్, ఏం.పి .డి.ఓ. పొలిసు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసుకొని నేడే సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యాచరణ రూపొందించుకోవలసినదిగా వారు తెలిపారు.
అనంతరం టెలికాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులతో మాట్లాడుతూ మండల అధికారులు సమన్వయంతో కార్యాచరణ రూపొందించుకొని ఎటువంటి ప్రమాదాలు, సంఘటనలు జరుగకుండా నిమజ్జనం కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినదిగా కోరారు. ఇందుకోసం సంబంధిత శాఖల సిబ్బందిని అవసరమైన ప్రాంతాలకు డిప్యూటీ చేస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో జెడ్పి సీఈఓ శైలేష్, డ్డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, డి.పి .ఓ. తరుణ్ కుమార్, ఆర్ అండ్ బి ఈఈ శ్యామసుందర్, విద్యుత్ శాఖ డి..ఈ., మునిసిపల్ కమీషనర్ శ్రీహరి, తదితర అధికారులు పాల్గొన్నారు.

Share This Post