జిల్లాలో చెరువుల పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలి జిల్లా చెరువుల పరిరక్షణ సమితి సమావేశంలో కలెక్టర్ హరీశ్

జిల్లాలో చెరువుల పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలి
జిల్లా చెరువుల పరిరక్షణ సమితి సమావేశంలో కలెక్టర్ హరీశ్
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని చెరువుల పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఈ విషయంలో అధికారులు అందరూ, సమన్వయంతో పని చేస్తే ఎంతో సులువుగా సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు.
మంగళవారం జిల్లాలోని చెరువుల పరిరక్షణపై అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యా నాయక్, ఇరిగేషన్, హెచ్ఎండీఏ, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఎన్ని చెరువులు ఉన్నాయి ?. ఇప్పటి వరకు ఎన్ని చెరువులు సర్వే చేసినారు ,అని మండల వారీగా తహశీల్దార్లు ని అడిగి తెలుసుకొన్నారు. జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటల పరిరక్షణకు ఆయా మండలాల తహశీల్దార్లు పూర్తి బాధ్యత వహించాలని ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అధికారులు కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు.జిల్లా వ్యాప్తంగా చెరువులు అన్యాక్రాంతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ఆయా మండలాల తహశీల్దార్లు, సర్వేయర్లు, హెచ్ఎండీఏ, నీటిపారుదల అధికారులు సమన్వయంతో పని చేస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని వివరించారు. అలాగే చెరువుల వద్ద ఎక్కడైనా నిర్మాణాలు తదితరాలు జరుగుతున్నట్లయితే క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులన్నీ సరిగ్గా ఉంటేనే సంబంధిత తహశీల్దార్లు అనుమతినివ్వాలని స్పష్టం చేసినారు.
ఈ విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పరిరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపినారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, హెచ్ఎండీఏ అధికారులు, ఆర్డీవోలు, రవి, మల్లయ్య , తహశీల్దార్లు, సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post