జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల కు సంబంధించి టెండర్లు పూర్తి చేసి ఇంజనీరింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు.

పత్రికా ప్రకటన                                                                తేది :23- 9- 2021

జోగులాంబ గద్వాలజిల్లా

జిల్లాలో చేపట్టిన పలు  అభివృద్ధి  పనుల కు సంబంధించి   టెండర్లు పూర్తి చేసి ఇంజనీరింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఇంజనీరింగ్ అధికారులకు  ఆదేశించారు.

గురువారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో పలు విభాగాల ఇంజనీరింగ్ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసిన రేవుల పల్లి టూరిజం పార్క్ , బస్టాండ్, సమీకృత మార్కెట్ యార్డ్, సిసి రోడ్లు, జిల్లా గ్రంథాలయ భవనం, మహిళ కళాశాల భవనాల నిర్మాణానికి గాను అగ్రిమెంట్ ఎంతవరకు ఉందని ,అగ్రిమెంట్ కంటే ముందే పనులు పూర్తి చేయవచ్చని . త్వరలో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పురోగతిలో వున్నా పనులపై దృష్టి సారించాలని , పనులకు  సంబంధించిన టెండర్ దారులు స్పందించని పక్షంలో పనులకు మంజురైన  నిధులు తప్పకుండా వస్తాయని వారికీ  భరోసా కల్పించి  టెండర్ వేసేలా చూడాలని , ఏవైతే పెద్ద వర్క్స్ ఉన్నాయో  వాటిపై దృష్టి పెట్టి పనులు  పూర్తి అయ్యేలా చూడాలన్నారు. మీ సిబంది తో ప్రతి నెల రివ్యూ సమావేశం ఏర్పాటు చేయాలనీ,  ప్రతివారం పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదిక అందజేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష, పంచాయత్ రాజ్ ఇ ఇ సమత ,శ్రీనివాసులు, ఆర్ టి సి మేనేజర్ ,  ఇంజనీరింగ్  అధికారులు తదితరులు  పాల్గొన్నారు

———————————————————————————-

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే జారీ చేయబడినది.

 

 

 

 

 

 

Share This Post