జిల్లాలో చేపడుతున్న పలు అభివృద్ధి పథకాలపై జడ్పీ, డి.ఆర్డి..ఓ, డి.పి.ఓ, ఎంపీడీవో, ఉపాధిహామీ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన, తేది:21.10.2021, వనపర్తి.

జిల్లాలో చేపడుతున్న పలు అభివృద్ధి పథకాలపై జాప్యం లేకుండా త్వరిత గతిన పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.
వనపర్తి జిల్లాలో పల్లె ప్రగతి, నర్సరీ, పల్లె ప్రకృతి వనం తదితర అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్, జడ్పీ, డి ఆర్ డి ఓ, డి పి ఓ, ఎంపీడీవో, ఉపాధిహామీ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 250 నర్సరీలలో మొక్కలు పెంచేందుకు తగు చర్యలు తీసుకోవాలని, పల్లె ప్రకృతి వనంలోని మొక్కలు సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ట్రాక్టర్ లోన్ చెల్లింపులు, లోన్స్ వివరాలు ఆమె అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ కార్యదర్శుల పనులపై నివేదిక వెంటనే ఆన్ లైన్ లో అప్లోడ్ చేయాలని, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం పనులు పెండింగ్ ఉంటే జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె సూచించారు. ఉపాధిహామీ కూలీల ద్వారా నర్సరీలలో పనులు నిర్వహించాలన్నారు.
జిల్లాలో చేపడుతున్న పల్లె ప్రగతి, తెలంగాణకు హరితహారం, పారిశుద్ధ్యం, గ్రామ పంచాయతీల పనులు, ట్రాక్టర్స్ రుణాలు, వ్యాక్సినేషన్, వైకుంఠ దమాలు, డంపింగ్ యార్డ్, ఎం జి ఎన్ ఆర్ ఈ జి ఎస్,100 రోజుల ఉపాధి హామీ పథకం, తదితర పనులపై ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తిచేయాలని ఆమె సూచించారు.
జిల్లాలో వ్యాక్సినేషన్ శాతం పెంచాలని, 100% టార్గెట్ పూర్తి చేసేలా అధికారులు, వైద్య సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్, జడ్ పి. సి ఈ ఓ వెంకట్ రెడ్డి, డిఆర్డిఓ నరసింహులు, డిపిఓ సురేష్, డి ఎం హెచ్ వో చందు నాయక్, డి పి ఓ సురేష్ కుమార్, అడిషనల్ డి పి ఓ యాదయ్య, అడిషనల్ డి ఆర్ డి ఓ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయడమైనది.

Share This Post