జిల్లాలో జనవరి 23 నుండి 25 వరకు పల్స్ పోలియో కార్యక్రమం 0-5 సంవత్సరాల పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు ……. అదనపు కలెక్టర్ రాజర్షి షా

 

జిల్లాలో జనవరి 23 నుండి 25 వరకు పల్స్ పోలియో కార్యక్రమం

0-5 సంవత్సరాల పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు
……. అదనపు కలెక్టర్ రాజర్షి షా

జిల్లాలో ఈనెల 23 నుండి 25 వరకు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సంబంధిత శాఖల అధికారులను కోరారు.

కలెక్టరేట్ మినీ సమావేశమందిరంలో సోమవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన వైద్య ఆరోగ్య శాఖ ,అనుబంధ శాఖల తో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా రాజర్షి మాట్లాడుతూ ఈ సంవత్సరం పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లాలో జనవరి, 23 నుండి 25 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 0-5 సంవత్సరాల పిల్లలకి పోలియో చుక్కలు వేస్తారన్నారు. 23న ఏర్పాటుచేసిన బూత్ లలో చుక్కలు వేస్తారని తెలిపారు.

23న పోలియో చుక్కలు వేసుకోకుండా మిగిలిపోయిన పిల్లలకు 24 మరియు 25 వ తేదీ లలో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి చుక్కలు వేస్తారని తెలిపారు.

జిల్లాలో 0-5 సంవత్సరాల పిల్లలు 1,86,190 మంది ఉంటారని అంచనా ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,119 పల్స్ పోలియో బూతులు ఏర్పాటు చేశామని, అందులో 922 గ్రామీణ ప్రాంతాల్లో, 197 పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

36 మొబైల్ టీమ్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 36 బస్టాండ్లలో ఒక రైల్వే స్టేషన్ లో పిపిఐ బూతుల ను ఏర్పాటు చేసి నట్లు తెలిపారు.

ఇట్టి కార్యక్రమంలో 4476 మంది వ్యాక్సినేటర్లు,1583 మంది వైద్య సిబ్బంది, 1344 మంది అంగన్వాడీ వర్కర్లు, 953 మంది ఆశ వర్కర్లు, ఇతర వాలంటీర్లు పదిమంది, ప్రోగ్రామ్ ఆఫీసర్లు పదిమంది పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.

వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ (08455-274824) ఏర్పాటు చేశారన్నారు. అదేవిధంగా పి.హెచ్.సి స్థాయిలో కమ్యూనికేషన్ కంట్రోల్ రూమ్ ఉంటుందన్నారు.

అన్ని ప్రభుత్వ, గుర్తింపు పొందిన ఆసుపత్రులలో పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి పోస్టర్లను ప్రదర్శించాలన్నారు. అన్ని గ్రామ పంచాయితీలలో 0-5 వయస్సు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని టాంటాం ద్వారా తెలియజేయాలన్నారు.

ట్రాన్స్కో, శిశు సంక్షేమం , డి ఆర్ డి ఎ, విద్య, ఆర్ టి సి, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ ల అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్ ప్రతినిధులు, తదితరులు సమన్వయ సహకారాలతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శశాంక్, ఐ ఎం ఏ చైర్మన్. డాక్టర్ చక్రపాణి, డిపిఓ సురేష్ మోహన్, సంక్షేమాధికారి పద్మావతి, డి ఆర్ డి ఓ అదనపు పి డి సూర్యారావు, ట్రాన్స్కో, ఆర్టీసీ, జెడ్ పి, విద్య శాఖల ప్రతినిధులు, రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Share This Post