జిల్లాలో జీవో నెం. 58, 59 ల ద్వారా క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.

జిల్లాలో జీవో నెం. 58, 59 ల ద్వారా క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో జీవో 58, 59 దరఖాస్తులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రమబద్ధీకరణ కు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జీవో 58 క్రింద జిల్లాలో 9,398 దరఖాస్తులు రాగా, 3,350 దరఖాస్తులు ఆమోదించినట్లు జీవో 59 క్రింద 3,620 దరఖాస్తులు రాగా, 1,853 దరఖాస్తులు ఆమోదించినట్లు ఆయన తెలిపారు. శుక్రవారం కల్లా మిగులు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలన్నారు. ఆన్లైన్ లో ఉన్న ఇంటి నెంబర్లను నమోదుచేయాలన్నారు. నమోదులు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, ఆర్డీఓ లు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post