జిల్లాలో టిబి పరీక్షలు చేపడుతున్న విధానాన్ని పరిశీలించిన ఢిల్లీ జాయింట్ సపోర్టివ్ సూపర్ విజన్ బృందం

జనగామ, అక్టోబర్ 5: జిల్లాలో టిబి పరీక్షల తీరుతెన్నులను క్షేత్ర స్థాయి పరిశీలనకు జిల్లాకు సోమవారం వచ్చిన ఢిల్లీ జాయింట్ సపోర్టివ్ సూపర్ విజన్ బృందం మంగళవారం జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య ను కలెక్టరేట్ లో కలిశారు. ఈ సందర్భంగా బృందం జిల్లాలో పర్యటన వివరాలను కలెక్టర్ కు వివరించారు. సోమ, మంగళవారాల్లో జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్ లలో పర్యటించి టిబి పరీక్షలు చేపడుతున్న విధానాన్ని పరిశీలించామన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, హెల్త్ వెల్ నెస్ సెంటర్లు, సిబినాట్, ట్రూనాట్, టిబి పరీక్షా కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షలు పరిశీలించినట్లు, పరీక్షలకు వచ్చిన వారిని అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నట్లు బృందం సభ్యులు తెలిపారు. జిల్లాలో టిబి పరీక్షల నిర్వహణ పట్ల వారు సంతృప్తి చెందారు.
ఈ బృందంలో డా. సనత్ త్రిపాఠి, డా. ధీరజ్ తుమ్మ, డా. వినీత్ కుమార్, డా. కారెల్ జోసెఫ్ వున్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post