ప్రచురణార్థం….1
జయశంకర్ భూపాలపల్లి నవంబర్ 30
జిల్లాలో టీఎన్జీవోఎస్ భవనం నిర్మించుకోవడం ఎంతో సంతోషకరం : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడానికి నాతో పాటు మీ సహకారం ఎంతో ఉంది : జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
జిల్లా కలెక్టర్‌గా నేను ఆదేశించిన పనులను కిందిస్థాయి ఉద్యోగులుగా మీరు సహకరించడం ఎంతో హర్షనీయం : కలెక్టర్
బుధవారం భూపాలపల్లి లో నిర్మించిన టి ఎన్ జి ఓ ఎస్ నూతన భవన ప్రారంభోత్సవానికి భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డితో కలిసి హాజరై మాట్లాడారు
వానాకాలంలో భారీ వర్షాల వల్ల ముంపుకు గురైన లోతట్టు ప్రాంతాలను నాతోపాటు 24/7 ల ఉద్యోగరీత్యా ఏ తారతమ్య భేదాలు లేకుండా పనిచేసి జిల్లాలో ఒక ప్రాణ నష్టం జరగకుండా కృషి చేసినందుకు నేను ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాను అని జిల్లా కలెక్టర్ అన్నారు రానున్న రోజుల్లో మీ సమస్యలు నా పరిధిలోన పరిష్కరించే ఏ సమస్య అయిన 100 శాతం సహకరిస్తానని ఏదీ ఏమైనా భూపాలపల్లి లో టి ఎన్ జి ఓ ఎస్ భవన నిర్మాణం పూర్తి చేసుకున్న మీ అందరికి అభినందనలు తెలియచేస్తున్నానని జిల్లా కలెక్టర్ అన్నారు
కార్యక్రమంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ
తెలంగాణ ఉద్యమంలో పెన్‌డౌన్ సకల జనుల సమ్మె ద్వారా ప్రత్యేక రాష్ట్ర సాధనలో మీ పాత్ర ఎంతో గొప్పదని సాధించుకున్న రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం ఉద్యోగులుగా మీ హక్కుల సాధనకై మీరు ఏ సహాయం అడిగిన మేము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు ఎట్టకేలకు భవనం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన మీ అందరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని అన్నారు కార్యక్రమంలో టి ఎన్ జి ఓ ఎస్ ఉద్యోగులు జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే ల ను శాలువాలు కప్పి గజమాలతో సత్కరించారు
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బూరుగు రవి కుమార్,జిల్లా కార్యదర్శి ఎమ్ హరికృష్ణ, కోశాధికారి దశరథ రామారావు
టి ఎన్ జి ఓ కేంద్ర సంఘం అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, సిటీ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, మునిసిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు, పదవ వార్డు కౌన్సిలర్ బద్ది సమ్మయ్య,
యూనియన్ జిల్లా కార్యవర్గము మరియు అన్ని యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు
…………………………………………………… పౌరసంబంధాల జిల్లా అధికారి జయశంకర్ భూపాలపల్లి చే జారిచేయనైనది