జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తికావాలి…… జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు.

గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాల పురోగతి పై కలెక్టర్ సంబంధిత అధికారులు ,కాంట్రాక్టర్లతో సమీక్షించారు. సైట్ వారీగా ఇళ్ల పురోగతిని,జాప్యానికి గల కారణాలను, ఏ ఏ దశలలో ఉన్నవి, ఎప్పటి వరకు పూర్తి చేసి ఇస్తారు, తదితర విషయాలను ఆరా తీశారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను చేపట్టిందన్నారు. ఇండ్లను త్వరిత గతిన పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందజేయాల్సి ఉందన్నారు.నిర్మాణాలు పూర్తయిన ఇండ్లన్నింటికి ఇంఫ్రా పనులు పూర్తిచేసి డిసెంబర్ నెలాఖరులోగా, మిగిలినవి జనవరి మొదటి వారం లోగా అందజేయాలన్నారు. కాంట్రాక్టర్లు సకాలంలో నిర్మాణ పనులను పుర్తిచేయాలన్నారు. అక్టోబర్ వరకు సమర్పించిన బిల్లుల చెల్లింపులు చేయడం జరిగిందన్నారు. తదుపరి జరిగిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు జరిగేలా చూస్తామని తెలిపారు.

ఎలాంటి పెండింగ్ లేకుండా నిర్ణీత సమయంలో గా వేగవంతంగా నాణ్యతతో పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఆయా ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ అధికారులు ఇళ్ల నిర్మాణాల పూర్తిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కాంట్రాక్టర్లచే త్వరితగతిన పనులు పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ రాజర్షి షా, పంచాయతీరాజ్ ఈ ఈ జగదీశ్వర్, పబ్లిక్ హెల్త్ ఈ ఈ వీర ప్రతాప్,
ఆర్ అండ్ బి డిఈ రవీందర్, ఆయా శాఖల డీఈలు, రెవిన్యూ డివిజనల్ అధికారులు నగేష్, రమేష్ బాబు, అంబాదాస్, కాంట్రాక్టర్లు , తదితరులు పాల్గొన్నారు.

Share This Post