జిల్లాలో తెలంగాణా అవతరణ దశాబ్ది ఉత్సవాల పకడ్బందీ గా ఏర్పాట్లు చేయాలి :- జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

జిల్లాలో  తెలంగాణా అవతరణ దశాబ్ది ఉత్సవాల  పకడ్బందీ గా ఏర్పాట్లు చేయాలి  :- జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

సోమవారం సాయంత్రం  స్కిల్ డౌలప్మెంట్ సెంటర్ లో   తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహింఛి జిల్లా లో తెలంగాణా అవతరణ ఉత్సవాలు పకడ్బందిగా ఏర్పాట్లు చేయాలన్ని ఆదేశించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమం జూన్ 2 నుండి 22 వరకు (21)  రోజులు జరిగే కార్యక్రమాలకు జిల్లా అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రతి కార్యక్రమానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి రోజువారి కార్యక్రమం విజయవంతం చేయుటకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు.  జిల్లా ప్రగతిపై అన్ని శాఖల అధికారులు వివరాలు తనకు  సమర్పించాలని ఆదేశించారు. ప్రతిరోజు ఒక శాఖ ఇన్విటేషన్ కార్డు ఉండాలన్నారు.  ప్రతి అధికారి తమ  శాఖ లకు సంభందించిన ప్రగతి   ఉపన్యాసం తయారు చేసుకోవాలన్నారు.  ప్రతి శాఖ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని రావాలన్నారు.  ప్రజా ప్రతినిధులు, ప్రజలు వెయ్యి మంది కి తగ్గకుండా హాజరయ్యేలా చూడాలన్నారు.  మండల కార్యాలయాలు  పూల తోరణాలతో, విద్యుత్ కాంతులతో  సిద్ధం చేయాలన్నారు.  21 రోజుల పాటు జరిగే దశాబ్ది ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు పూర్తి ప్రణాళికతో ఉండాలన్నారు.  ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, కవి సమ్మేళనాలు నిర్వహించడం చేయాలన్నారు.  వచ్చిన ప్రజలకు భోజనాలను ఏర్పాటు చేయాలన్నారు.  పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి  చేపట్టిన క్రయక్రమాలు ముందు తరవాతి నిర్వహించిన పనులపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. ఆయ సంబందిత శాఖలకు కేటాయించిన రోజుల వారిగా 21 రోజుల పటు అంగరంగ వైభవంగా దశాబ్ది ఉస్త్సాహాలు జిల్లా లో నిర్వహించాలన్ని అధికారులకు ఆదేశించారు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్

 

👉జూన్ 2న అన్ని జిల్లాల్లో

జాతీయ పతాకావిష్కరణ

 

👉జూన్ 3న రైతు దినోత్సవం

 

👉జూన్ 4న పోలీసుల ఆధ్వర్యంలో

సురక్షాదినోత్సవం

 

👉జూన్ 5న విద్యుత్ విజయోత్సవం

 

👉జూన్ 6న పారిశ్రామిక ప్రగతి ఉత్సవం

 

👉జూన్ 7న సాగునీటి దినోత్సవం

 

👉జూన్ 8న ఊరూరా చెరువుల పండుగ

 

👉జూన్ 9న సంక్షేమ సంబురాల నిర్వహణ

 

👉జూన్ 10న సుపరిపాలన దినోత్సవం

 

👉జూన్ 11న సాహిత్య దినోత్సవం నిర్వహణ

 

👉జూన్ 12న తెలంగాణ రన్ నిర్వహణ

 

👉జూన్ 13న మహిళా సంక్షేమ దినోత్సవం

 

👉జూన్ 14న వైద్యారోగ్య దినోత్సవం

 

👉జూన్ 15న పల్లె ప్రగతి దినోత్సవం

 

👉జూన్ 16న పట్టణ ప్రగతి దినోత్సవం

 

👉జూన్ 17న గిరిజనోత్సవం

 

👉జూన్ 18న మంచినీళ్ల పండుగ

 

👉జూన్ 19న హరితోత్సవం

 

👉జూన్ 20న విద్యా దినోత్సవం

 

👉జూన్ 21న ఆధ్యాత్మిక దినోత్సవం

 

👉జూన్ 22న  అమరుల సంస్మరణ నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు……. జిల్లా పవర్ సంబంధాల అధికారి నారాయణపేట చేజారి చేయబడింది.

 

ఈ  సమావేశం లో అదనపు కలెక్టర్ మయంక్ మిత్తల్,  DSP సత్యనారాయణ, RDO రామచందర్, DRDO గోపాల్ నాయక్,  జాన్ సుధాకర్, మురళి మరియు జిల్లా అధికారులు  తదిదితరులు అధికారులు పాల్గొన్నారు.

Share This Post