జిల్లాలో తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకలను పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రజా ప్రతినిధులు అధికారులు కలిసికట్టుగా పనిచేయాలి- తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి

జిల్లాలో తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకలను పండుగ వాతావరణంలో
అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రజా ప్రతినిధులు అధికారులు కలిసికట్టుగా పనిచేయాలి

– జిల్లా ప్రగతి ప్రస్తానాన్ని చాటేలా వేడుకలు నిర్వహించాలి

– తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి

———————————————————–

తెలంగాణ రాష్టం సాధించిన అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గత తొమ్మిది సంవత్సరాలుగా సాధించిన ప్రగతిని… ప్రజా ప్రతినిధులు, అధికారులు సమిష్టిగా పల్లె పల్లెన ప్రజలకు వివరిస్తూ ఘనంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి అన్నారు.

సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ , వైస్ చైర్మన్ సిద్దం వేణు, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, జిల్లా అదనపు కలెక్టర్ లు బి సత్య ప్రసాద్,ఎన్ ఖీమ్యా నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ లు జిందంకళా చక్రపాణి , రామతీర్థపు మాధవి, సెస్ వైస్ చైర్మన్ తిరుపతి, Ao బి గంగయ్య, ఎంపీపీ లు, zptc లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి మాట్లాడుతూ…

రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రి శ్రీ కే టి ఆర్ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా, నియోజకవర్గ, మండలం,గ్రామ స్థాయిలో ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి కట్టుగా ప్రభుత్వం సూచించిన క్యాలెండర్ ప్రకారం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు.

జూన్ 2 న పథకావిష్కరణ, దశాబ్ది ఉత్సవ సందేశం తో ఉత్సవాలు ప్రారంభమై జూన్ 22 అమరవీరుల సంస్మరణ సభ,అమరవీరుల స్తూపం అవిష్కరణతో ముగిసయనున్నట్లు తెలిపారు.

20 రోజుల పాటు ఊరూరా పండుగ వాతావరణంలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని, తెలంగాణ ప్రగతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా వెలుగెత్తి చాటాలన్నారు. రాష్ట్రం రాక ముందు, వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని మరొక్కసారి గుర్తు చేస్తూ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రం ఏర్పాటు లాగే రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు అనేది ఈ ప్రాంత ప్రజల వాంఛ నెరవేరిందని, అదే విధంగా నూతన మండలాలు, నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుతో ప్రజలకు పాలన మరింత దగ్గరైందని అన్నారు. కొత్త జిల్లాగా ఏర్పాటు అయిన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు.

జిల్లాలో గడిచిన 9 ఎండ్లుగా అన్ని రంగాలలో ఎంతో అభివృద్ది సాధించిందని …..
ఆ అభివృద్ధి వివరాలకు గడప గడపకు చేరేలా ప్రజా ప్రతినిధుల,అధికారులు కృషి చేయాలన్నారు. పోస్టర్ లు, కరపత్రాలు, ఫ్లెక్సీ ల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు.

 

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల కార్యచరణ ప్రణాళికను ఎంపీపీ లు, zptc లకు వివరించారు

వచ్చే నెల జూన్ 2 నుంచి 22 వరకు జిల్లాలో జరుగు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా
గ్రామల నుంచి జిల్లా స్థాయి వరకు.. ఏ రోజు ఏ కార్యక్రమం నిర్వహించ నున్నారు , కార్యక్రమాల సమన్వయం బాధ్యుల వివరాలను వెల్లడించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా దశాబ్ది ప్రగతి తో పాటు తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని.. చాటేలా జిల్లాలో పండుగ వాతావరణంలో వైభవోపేతంగా నిర్వహించేందుకు కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేశామని ప్రజా ప్రతినిధుల సహకారం ఉంటేనే క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు సక్సెస్ అవుతాయని చెప్పారు. ప్రజా ప్రతినిధులు వేడుకల్లో క్రీయశీలక భాగస్వామ్యం కావాలని కోరారు.

 

 

ప్రజా ప్రతినిధులు గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాలను అధికారులను సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణం లో నిర్వహించి.. విజయవంతం చేయాలని సూచించారు.

 

Share This Post