జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

గురువారం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం లో అమరవీరుల స్మారక స్థూపానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, జిల్లా అదనపు కలెక్టర్లు తిరుపతి రావు, ప్రతిక్ జైన్ ఘన నివాళులు అర్పించారు.

అనంతరం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రెడ్డికి పోలీసులు గౌరవ వందనంతో జిల్లా యంత్రాంగం తరపున ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఎంతో మంది అమరవీరుల త్యాగాల పునాదుల పై రాష్ట్ర ఏర్పాటు జరిగిందని, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ నేడు దేశం ముందు సగర్వంగా తలెత్తుకుని నిలబడిందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే కేసిఆర్ ప్రభుత్వ ధ్యేయం అని, రాష్ట్ర అభివృద్దే అమరులకు అసలైన నివాళి అని అన్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు. జిల్లా మహిళ సమాఖ్య కు 25 కోట్ల 65 లక్షల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.

ఈ వేడుకల్లో హాజరైన జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, కలెక్టర్ అమోయ్ కుమార్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, జిల్లా అదనపు కలెక్టర్లు తిరుపతి రావు, ప్రతీక్ జైన్, డీఆర్ఓ హరిప్రియ, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ వెంకటచారి జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post