ప్రచురణార్ధం.
ఆగష్టు 17 ఖమ్మం:
జిల్లాలో దళిత వాడలు, గిరిజన ఆవాసాలలో మౌళిక వసతుల కల్పనకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్లో సాంఘిక, గిరిజన సంక్షేమ, పంచాయితీరాజ్, జిల్లా పంచాయితీ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అర్బన్ లోకల్ బాడీస్, గ్రామ పంచాయితీ పరిధిలో గల దళిత వాడలు, గిరిజన ఆవాసాలలో ఇంకనూ అవసరమైన సి.సి రోడ్లు, డ్రైన్లు, విద్యుత్ దీపాలు, విద్యుత్ స్థంబాలు తదితర మౌళిక వసతుల కల్పనకు గాను జనాభా ప్రాతిపదికన అవసరమైన మౌళిక వసతుల పనులను గుర్తించి. అంచనాలతో కూడిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. దళితవాడలు, గిరిజన అవాసాలలో ఇప్పటికే ఎం.పి.డి.ఓలు, పంచాయితీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు చేసిన సర్వేను మరొకమారు సరిచూసుకొని గ్రామ, మండల స్థాయి ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో సమగ్ర ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం గుర్తిస్తున్న పనులను ఇటీవలే పల్లె ప్రగతిలో చేపట్టిన పనుల నివేదికతో సరిచూడాలని అన్ని దళితవాడలలో గిరిజన ఆవాసాలను తప్పనిసరిగా సందర్శించి అట్టి ఆవాసాలలో ఇంకనూ కావలసిన సౌకర్యాల పనులు గుర్తించి అంచనాలతో కూడిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కలెక్టర్ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి సత్యనారాయణ, జిల్లా పంచాయితీ అధికారి ప్రభాకర్ రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అప్పారావు, పంచాయితీరాజ్ పర్యవేక్షక ఇంజనీరు సీతారం, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు జి.వి. చంద్రమౌళి, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.