జిల్లాలో ధరణి పోర్టల్ విజయవంతం – కలెక్టర్ హరీష్

జిల్లాలో ధరణి పోర్టల్ విజయవంతం – కలెక్టర్ హరీష్

భూ సమస్యల పరిష్కారం, ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్ మెదక్ జిల్లాలో విజయవంతంగా అమలవుతుందని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ తెలిపారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్బంగా శుక్రవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్య మంత్రి మంచి విజన్ తో, పారదర్శక మైన రెవెన్యూ వ్యవస్థను, రికార్డులను తయారు చేసేందుకు అందుబాటులోకి తెచ్చిన ధరణి సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. గతంలో జిల్లాలో కేవలం మూడు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉండగా ధరణి వచ్చాక జిల్లా లోని 21 తహశీల్డార్ ఆఫీసు లలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కలుగుతోందన్నారు. స్లాట్ బుక్ చేసుకుంటే చాలా తక్కువ సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవడంతో పాటు, మ్యుటేషన్ ప్రాసెస్ కూడా వెంటనే పూర్తి అవుతుందన్నారు. జిల్లాలో గడచిన ఏడాది కాలంలో 26,640 సేల్స్ ట్రాన్ జెక్షన్ లు, 6,442 గిఫ్ట్ డీడ్ లు, 3,798 సక్షేశన్ లు జరిగాయని వివరించారు. అలాగే 6,678 పెండింగ్ మ్యుటేషన్ లు క్లియర్ చేశామని, 6,238 గ్రీవెన్స్, 2102 ప్రోహిబిషన్ లిస్ట్ సమస్యలు, 708 కోర్ట్ కేసులు పరిష్కరించామనీ తెలిపారు. ధరణి లో 31 రకాల మాడ్యుల్ లు అందుబాటులో ఉన్నాయని ప్రజలు వీటిని వినియోగించు కొని భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించు కావాలని సూచించారు. గతంలో కలెక్టర్ గ్రీవెన్స్ కు నెలకు 500 అప్లికేషన్లు వచ్చేవని, ఇప్పుడు వాటి సంఖ్య 40 కి తగ్గిందన్నారు. ఫారెస్ట్ , రెవెన్యూ శాఖల మధ్య వివాదాస్పదంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి నవంబర్ మూడవ తేదీన ప్రజా ప్రతినిధులు, సంబధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్టు తెలిపారు. వక్ఫ్ బోర్డు, ఎండోమెంట్ ల్యాండ్ ల పరిరక్షణకు, అక్రమ కట్టడాలను నిరోధించేందుకు తహశీల్దార్, పోలీస్, ఇంజనీర్, మున్సిపల్, ఫైర్ ఆఫీసర్ లతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు.
ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, అదనపు కలెక్టర్ రమేష్, ఆర్.డి.ఓ. సాయి రామ్ పాల్గొన్నారు.
ధరణి హైలెట్స్
నిత్యం పెరుగుతున్నమార్పులు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చుకునే సామర్థ్యం ధరణి యొక్క ప్రత్యేకత. ప్రస్తుతం ధరణిలో 31 లావాదేవీల మాడ్యూల్స్, 10 ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ ఉన్నాయి.
రాష్ట్రంలో ధరణి పురోగతి వివరాలు
హిట్‌ల సంఖ్య : 5.17 కోట్లు
బుక్ చేసిన స్లాట్‌లు : 10,45,878
పూర్తయిన లావాదేవీలు : 10,00,973
విక్రయాలు : 5,02,281
గిఫ్ట్ డీడ్ : 1,58,215
వారసత్వం : 72,085
తనఖా : 58,285
పరిష్కరించబడిన ఫిర్యాదులు : 5.17 లక్షలు
పెండింగ్ మ్యుటేషన్లు. : 2,07,229
భూమి సంబంధిత విషయాలపై ఫిర్యాదులు : 1,73,718
నిషేధించబడిన జాబితా : 51,794
కోర్ట్ కేసులు మరియు సమాచారం : 24,618
*నిషేదిత భూముల విషయంలో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించేసందుకు గాను గ్రామాలవారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి నెలరోజుల్లో పరిష్కారానికి చర్యలు.
*ధరణి ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.

Share This Post