జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలును పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.

* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి నవంబర్ 27 (శనివారం).
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలును పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.
శనివారం ధాన్యం కొనుగోళ్లు పై హైదరాబాద్ నుండి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టినా, అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్ రావు, సెక్రెటరీ అఫ్ ట్రాన్స్ పోర్ట్ శ్రీనివాసరాజ లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ లతో సమీక్షించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు కు 185 కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.
నాణ్యత కొరకు ప్యాడి క్లినర్లు, మాయిచ్చర్ మీటర్ లు, ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు ఏర్పాటు చేశామని, కొనుగోలు చేసిన ధాన్యం తడవకుండా ప్రతి కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్లు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో గన్ని బ్యాగులు కొనుగోలు కేంద్రాలలో అందుబాటులో ఉంచామన్నారు.
17 తేమ శాతం ఉన్న ధాన్యానికి టోకెన్ లు జారీ చేసి తక్షణం కొనుగోలు చేయడమే గాక ప్రతి కొనుగోలును ట్యాబ్ లో నమోదు చేస్తూ రవాణా చేస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ దళారులు మధ్యవర్తులు ఏర్పడి ఇతర రాష్ట్రాల ధాన్యాన్ని మన రాష్ట్రానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి ధాన్యం సరఫరా కాకుండా సరిహద్దు చెక్ పోస్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేసి పోలీస్, అగ్రికల్చర్, సివిల్ సప్లై, ట్రాన్స్ పోర్ట్ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు.
చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ భారత ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ.) ధాన్యం కొనుగోలు చేయక పోవడం వలన తెలంగాణలో పండే ధాన్యం పారబాయిల్డ్ కొరకు మాత్రమే వినియోగిస్తున్నందున వరి పంట వేయరాదని రైతులకు రైతు వేదికల ద్వారా అవగాహన పరచాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ సలహాలు, సూచనలు అందజేయాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సివిల్ సప్లై డిఎం రాఘవేందర్, డిఎస్ఓ గౌరీశంకర్, జిల్లా కో ఆపరేటివ్ ఆఫీసర్ మద్దిలేటి , అధికారులు సిబ్బంది పాల్గొన్నారు
……………………………………….. డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే

Share This Post