జిల్లాలో ధాన్యం కొనుగోలుకేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలును పటిష్టంగా నిర్వహించాలి ::జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు.

 

జిల్లాలో ధాన్యం కొనుగోలుకేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలును పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో 1 లక్ష 10 వేల 682 ఎకరాలకు గాను 155 ధాన్యం కొనుగోళ్లు కు కేంద్రాలు ఏర్పాటు చేసి 56,847 రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.

నాణ్యత కొరకు ప్యాడి క్లినర్లు ,మాయిచ్చర్ మీటర్ లు, ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు ఏర్పాటు చేశామని, కొనుగోలు చేసిన ధాన్యం తడవకుండా ప్రతి కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్లు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో గన్ని బ్యాగులు కొనుగోలు కేంద్రాలలో అందుబాటులో ఉంచామన్నారు.

17 తేమ శాతం ఉన్న ధాన్యానికి టోకెన్ లు జారీ చేసి తక్షణం కొనుగోలు చేయడమే గాక ప్రతి కొనుగోలు ట్యాబ్ లో నమోదు చేస్తూ రవాణా చేస్తున్నామన్నారు.

తెలంగాణ లో పండే ధాన్యం పారబాయిల్డ్ కొరకు మాత్రమే వినియోగిస్తున్నందున వరి పంట వేయరాదని రైతులకు రైతు వేదికల ద్వారా అవగాహన కల్పించాలి అన్నారు.ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ సలహాలు, సూచనలు అందజేయాలన్నారు

2022 వచ్చే వేసంగి సీజన్లో ములుగు జిల్లా రైతులు వరి పంటను సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపేలా మండల వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని

సోమవారం రోజున ఏటూరునాగారం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి విధుల్లో భాగంగా ఐటీడీఏ కార్యాలయానికి విచ్చేసి జిల్లా వ్యవసాయ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అవసరం ఉన్న మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు అదే విధంగా వచ్చే యాసంగి సీజన్ లో రైతులు వరి పంట వేయకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసే విధంగా చర్యలు చేపట్టడం , వేస్టేజీ, తేమశాతం పరిశీలించిన తరువాతే రైతు ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్ల లకు పంపినట్లయితే రైతుకు లాభం చేకూరుతుందని అన్నారు. గత సంవత్సరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వివరాలు జిల్లాలో వరి సాగు చేస్తున్న రైతుల వివరాలు గత సంవత్సరం కొనుగోలు కేంద్రాల వద్ద టోకెన్లు జారీచేసిన వివరాలు, మొత్తం వివరాలు పరిగణలోకి తీసుకొని మండల వ్యవసాయ అధికారులు వాట్సాప్ గ్రూప్ లో డైలీ మానిటరింగ్ చేయాలన్నారు.

వచ్చే సంవత్సరం రైతులు వరి పండించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం కొనుగోలు చేయదని మండలాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు వారి ఆధ్వర్యంలో రైతు వేదికల వద్ద సమావేశాలు ఏర్పాటు చేసి తెలియపరచాలి అన్నారు. రైతు వేదికల వద్ద హ్యాబిటేషన్ ,గ్రామ పంచాయితీ వారీగా, పూర్తి సమాచారం ఉండాలన్నారు. రైతు బీమా పోర్టల్లో రైతుల సమాచారం పూర్తిగా ఉండాలని రైతు బీమా పెండింగ్ వారంలో పూర్తి చేయాలి అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గౌస్ హైదర్,సంబంధిత మండల వ్యవసాయ అధికారులు, పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ పోస్టర్, మరియు బుక్ లెట్స్ ను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

Share This Post