జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళు సాఫీగా,వేగవంతంగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు.

 

ధాన్యం కొనుగోల్లు వేగంగా పూర్తి కావాలి..

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించడానికి సిద్ధం చేయాలి..

కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి…

అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ విధిగా తీసుకోవాలి…

మెడికల్ కళాశాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి…….
జిల్లా కలెక్టర్ హనుమంతరావు

జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళు సాఫీగా,వేగవంతంగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు.

సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్ళ పురోగతి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కో వి డ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పురోగతి, మెడికల్ కళాశాల నిర్మాణ పనుల పురోగతి పై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి, దిశా నిర్దేశం చేశారు.

జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం కు సంబంధించి ఏరోజుకు ఆరోజు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేశాలన్నారు. ట్యాబ్ ఎంట్రీ లో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నాణ్యత ప్రమాణాలతో వచ్చిన ధాన్యం మొత్తం కొనాలన్నారు. PACS కేంద్రాల ద్వారా 87 శాతం, ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా 83 శాతం ధాన్యం సేకరించినట్లు తెలిపారు.

కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం వెంట వెంటనే తూకం వేసి, ఎప్పటికప్పుడు రైస్ మిల్లు లకు పంపాలని సూచించారు. ధాన్యం కొన్న రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చెల్లింపులో జాప్యం జరగరాదన్నారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చిన రైతులు ఓటిపి నెంబర్ ఇచ్చి సహకరించాలని కలెక్టర్ కోరారు.

*వాక్సినేశన్ శతశాతం పూర్తి కావాలి*
కరోనా న్యూ వేరియంట్ పలు దేశాల్లో ప్రబలుతున్నదని, జిల్లాలో అన్ని విధాల ముందస్తు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలో కోవిడ్ జాగ్రత్తలు విధిగా పాటించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వంద శాతం వ్యాక్సినేషన్ త్వరితగతిన పూర్తి చేయాలనీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజలకు వాక్సినేషన్ పై అవగాహన కల్పించి చైతన్య పరచాలన్నారు. వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకుని, రెండవ డోసు తీసుకోని వారందరికీ ఫోన్ చేసి పిలిపించి రెండవ డోస్ వ్యాక్సిన్ ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు వ్యాక్సినేషన్ మొదటి డోసు 80 శాతం, రెండవ డోసు 37 శాతం పూర్తయిందని తెలిపారు.

కరోనా నివారణకు వ్యాక్సినేషన్ రక్షణ కవచం లాంటిదన్నారు.
కరోనాకు వ్యాక్సిన్ శ్రీరామరక్ష లాంటిదని, వ్యాక్సినేషన్ తీసుకుంటే ఎలాంటి వేరియంట్లూ వచ్చినా తక్కువ ప్రమాదం తో బయట పడగలమన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు విదిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన సూచించారు. వ్యాక్సిన్ పట్ల నిర్లక్ష్యం పనికి రాదని, అజాగ్రత్త , అలక్ష్యంతో ప్రాణాలకు ప్రమాదం తెచ్చుకోవద్దని ఆయన హితవు పలికారు.

వ్యాక్సిన్ తీసుకోకుండా అశ్రద్ధ చేస్తున్న వారు వెంటనే తీసుకోవాలని ఆయన కోరారు. మనల్ని మనం కాపాడుకుంటూ, మన కుటుంబాన్ని ,జిల్లాను, రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

వైద్య కళాశాల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. రాత్రింబగళ్ళు పనులు కొనసాగించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇంటర్నల్ నిర్మాణ పనులు, రోజు వారి పనుల ప్లానింగ్ ఇవ్వాలని సూచించారు.

జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను వేగవంతంగా పూర్తి చేసి ప్రారంభించడానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. డిసెంబర్ పది లోపు ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. అన్ని మౌలిక వసతులతో అందించాలన్నారు. నిర్మాణంలో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలన్నారు. ఆయా పనులన్నింటినీ పూర్తిచేసి ప్రారంభించడానికి సిద్ధం చేసేలా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

ఈ సమీక్షలో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, డి ఆర్ డి ఓ శ్రీనివాస్ రావు, డి సి ఓ మరియు హౌసింగ్ నోడల్ అధికారి తుమ్మ ప్రసాద్, ఆర్ అండ్ బి ఈ ఈ సురేష్, పంచాయతీ రాజ్ ఈ ఈ జగదీశ్వర్, సివిల్ సప్లైస్ డి ఎం సుగుణ భాయ్, డి ఈ లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post