జిల్లాలో నిర్దేశిత ఆయిల్ పామ్ పంటల సాగు లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.

జిల్లాలో నిర్దేశిత ఆయిల్ పామ్ పంటల సాగు లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడివోసి కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో జిల్లాలో ఆయిల్ పామ్ సాగుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి 12,100 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటే లక్ష్యాన్ని ఏర్పరచినట్లు తెలిపారు. జనవరి, 2023 మాసాంతానికి లక్ష్యం 8,500 ఎకరాలకు గాను 28 జనవరి, 2023 నాటికి 7,207.85 ఎకరాలలో (85%) 1,694 మంది రైతులకు సంబంధించి భూముల్లో ఆయిల్ పామ్ పంటలను సాగు చేసినట్లు ఆయన అన్నారు. ఆయిల్ పామ్ తోటలను సాగు చేసేందుకు నీటి వసతి, విద్యుతు సౌకర్యం ఉన్న భూములు కలిగిన రైతులను గుర్తించాలని ఆయన తెలిపారు. పురోగతి లేని మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మండలం వారిగా మండల వ్యవసాయ అధికారులు ఆయిల్ పామ్ పంటల సాగుతో లాభాలు, సాగుకు వచ్చే సబ్సిడీ పై పూర్తి స్తాయి లో తెలియ జేస్తూ అవగాహన కల్పించాలన్నారు. ఆయిల్ పామ్ సాగుతో పాటు అంతర పంటలను సాగుచేయవచ్చన్నారు. జిల్లాలో 40 శాతానికి పైగా ఎస్సి, ఎస్టీ రైతులు ఉన్నట్లు, ఆయిల్ పామ్ సాగుపై వీరిలో చైతన్యం తేవాలన్నారు. ఆర్వోఎఫార్ భూముల్లో ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు సమన్వయంతో లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, ఉద్యానవన సహాయ సంచాలకులు కె. అనిత, ఉద్యానవన అధికారులు జి. సందీప్ కుమార్, జి. నగేష్, ఏ. వేణు, పి. అపర్ణ, కె. మీనాక్షి, ఎంఐ ఇంజనీర్ పి. నాగమణి, టీఎస్ ఆయిల్ ఫెడ్ డివిజనల్ అధికారి ఏ. బాలకృష్ణ, గోద్రెజ్ కంపెనీ ఏరియా మేనేజర్ రామకృష్ణ, ఫీల్డ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post