జిల్లాలో నిర్వహించు స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాలు 75 వసంతాల స్వతంత్ర భారతావనిగా గౌరవం, జాతీయత పెంపొందేలా నిర్వహించాలి ….జిల్లా కలెక్టర్ కె. శశాంక.

జిల్లాలో నిర్వహించు స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాలు 75 వసంతాల స్వతంత్ర భారతావనిగా గౌరవం, జాతీయత పెంపొందేలా నిర్వహించాలి ….జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

మహబూబాబాద్, ఆగస్ట్ -06:

జిల్లాలో నిర్వహించు స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాలు 75 వసంతాల స్వతంత్ర భారతావనిగా గౌరవం, జాతీయత పెంపొందేలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు.

శనివారం ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక జెడ్పి చైర్ పర్సన్ అంగోతు బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ప్రజా ప్రతినిధులతో కలిసి ఈ నెల 8 నుండి 22 వరకు పదిహేను రోజుల పాటు నిర్వహించనున్న స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లపై కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ 8 నుండి 22 వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాలు 75 వసంతాల స్వతంత్ర భారతావనిగా గౌరవం, జాతీయత పెంపొందేలా రెండు వారాల పాటు ప్రతి రోజు ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. 8న రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాదులో ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారని, 9న జాతీయ జెండాను ప్రతి ఇంటికి చేరవేసే కార్యక్రమం మొదలవుతుందని, 10న వనమహోత్సవం, ఫ్రీడం పార్కు కార్యక్రమంలో మొక్కలు నాటనున్నాట్లు తెలిపారు. 11న పోలీస్ శాఖ సహాయంతో ఫ్రీడం రన్, 12వ తేదీన జాతీయ సమైక్యత భావాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రక్షాబంధన్ చేపట్టాలని, 13న జాతీయ పతాకం, ప్లే కార్డులతో విద్యార్ధులు, ఎన్.సి.సి., ఎన్.ఎస్.ఎస్., ఉద్యోగులతొ ర్యాలీలు, 14న జానపద కళాకారుల ప్రదర్శన, బాణాసంచా కార్యక్రమం, 15న స్వాతంత్య్ర దినోత్సవం, 16న తెలంగాణ రాష్ట్ర సామూహిక జాతీయ గీతాలపన, సాయంత్రం కవి సమ్మెళనం, 17న రక్తదాన శిభిరాలు, 18న ఫ్రీడం కప్ క్రీడా పోటీలు, 19న పండ్లు, స్వీట్ లను ఆసుపత్రుల్లో, వృద్ధాశ్రమాల్లొ, అనాథ ఆశ్రమాల్లో, జైళ్లలో అందించనున్నట్లు, 20న రంగోలి కార్యక్రమం స్వయం సహాయక సంఘాల మహిళలచే నిర్వహణ, 21న ప్రజాప్రతినిధులచే సమావేశాలు, 22న ముగింపు కార్యక్రమం జిల్లాలో గాని, రాష్ట్ర స్థాయిలో ఉంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కార్యక్రమాలను నిర్వహించుకొని విజయవంతం చేయాలని, ఎంతో మంది బలిదానాలతో వచ్చిన స్వాతంత్య్రం 75 వసంతాల కార్యక్రమాలు జిల్లాలో బాధ్యతగా షెడ్యూల్ ప్రకారం చేపట్టి విజయవంతం చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్పి శరత్ చంద్ర పవార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, మునిసిపల్ చైర్ పర్సన్స్, జెడ్పీ సి. ఈ. ఓ. రమాదేవి, డి.ఆర్.డి. ఓ. సన్యాసయ్య, డి.పి. ఓ. సాయిబాబా, మునిసిపల్ కమిషనర్ లు, జిల్లా క్రీడా శాఖాధికారి, డి. ఈ. ఓ. ఎం.డి. అబ్దుల్ హై, ఆర్ అండ్ బి ఈ.ఈ. తానేశ్వర్, ఆర్డీవోలు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post