జిల్లాలో నెట్టెంపాడు ప్రాజెక్ట్ మరియు పి జెపి జూరాల ప్రాజెక్ట్ పరిదిలోని పునరావాస కేంద్రాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.

పత్రికా ప్రకటన                                                         తేది: 24-11-2021

 

జిల్లాలో నెట్టెంపాడు  ప్రాజెక్ట్  మరియు పి జెపి జూరాల  ప్రాజెక్ట్ పరిదిలోని  పునరావాస కేంద్రాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.

బుధవారం కల్లెక్టరేట్ సమావేశ హాలు నందు ఇరిగేషన్ , పి జె పి  అధికారులతో  పునరావాస కేంద్రాల   పై ఏర్పాటు చేసిన సమీక్ష  సమావేశం లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని, ఆలూరు, ర్యాలంపాడు, చిన్నోనిపల్లి, ఉప్పేరు, గార్లపాడు, నాగర్ దొడ్డి, రేవులపల్లి, నెట్టెంపాడు  గ్రామాలలో నిర్మాణం లో  ఉన్న పునరావాస కేంద్రాల పెండింగ్ పనులు ఆలస్యం చేయకుండా  పూర్తి చేయాలని, పునరావాస కేంద్రాలలో నిర్వాసితులకు అన్ని వసతులు కల్పించే విధంగా  అధికారులు తగు  చర్యలు తీసుకోవాలని అన్నారు. పునరావాస కేంద్రాల   కు సంబంధించిన టెండర్లు, సర్వే పనులు ఎంత వరకు వచ్చాయనీ  అధికారులను అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాల కోసం స్థలాన్ని గుర్తించి, టెండర్లు, సర్వే ప్రారంభించాలని,  ఎస్టిమేషన్ పెండింగ్ ఉంటే పూర్తి చేసి ఎస్టిమేషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలనీ అన్నారు.  సర్వే పనులు పూర్తి చేసి, లె-అవుట్ లు వేయాలని, సి.సి రోడ్లు, మిషన్ భగీరథ పైప్ లైన్లు, విద్యుత్ కనెక్షన్లు, కంపౌండ్ వాల్, ఏర్పాటు చేయాలని తెలిపారు. పునరావాస కేంద్రాలలో తాగునీరు, పాఠశాలలు,  విద్యుత్ ,రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలనీ, గ్రామ పంచాయతి బిల్డింగ్ , కమ్యూనిటీ హాలుల నిర్మాణాలు  పూర్తి చేయాలనీ  అధికారులకు  ఆదేశించారు.

సమావేశం లో ఆర్ డి ఓ రాములు , శ్రీనివాస్ రావు ఎస్ ఇ , రహీముద్దీన్, జుబేర్ అహ్మద్,విజయ కుమార్ రెడ్డి,   ఇ ఇ లు , మిషన్ భగీరథ శ్రీధర్ రెడ్డి,గ్రిడ్  భీమేశ్వర్ రెడ్డి,  సంబదిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————–            జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే  జారీ చేయబడినది.

 

Share This Post