జిల్లాలో నెలాఖరులోగా 100 శాంతం వాక్సినేషన్ పూర్తి చేయాలి.. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

కోవిడ్ వాక్సినేషన్, ఒమిక్రాన్ వేరియంట్ పై వికారాబాద్ జిల్లా కేంద్రంలో ని డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ భవన్ లో జరిగిన పట్టణ ప్రాంత ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్యుల సమావేశంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కోవిడ్ పోరులో ముందున్న వైద్యులకు అభినందనలు తెలియజేసారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, వికారాబాద్ జిల్లా వాక్సినేషన్ లో 83 శాతం చేరుకున్నందుకు జిల్లా కలెక్టరు కు,అధికార యంత్రాగానికి అభినందనలు తెలియజేసారు.
వలస వెళ్లిన, వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
100 శాతం వాక్సినేషన్ ను పూర్తి చేసి కోవిడ్ ను నిర్ములీస్దామని తెలిపారు. ప్రజాప్రతినిధులు అందరూ ప్రజల ఆరోగ్యం కోసం ఇంటింటికి వెళ్లి మరీ వాక్సిన్ వేయించాలని, ప్రజలను చైతన్య వంతులను చేయాలని కోరారు.
ఓమిక్రాన్ వేరియంట్ పై భయం వద్దు, జాగ్రత్తలు పాటించి జయిద్దామని తెలిపారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైన ఎదుర్కోవాటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలియజేసారు. ప్రతి ఒక్కరు వాక్సిన్ వేసుకోవాలని, మాస్క్ పెట్టుకోవాలి, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
వాక్సిన్ పై అపోహలు,భయాలు విడనాడి 100 శాతం వేసుకోవాలని కోరారు. 2 డోసులు వాక్సిన్ వేసుకున్నవారికి ప్రాణాపాయం ఉండదన్నారు . కరోనా వచ్చిన స్వల్ప లక్షణాలతో వెళ్ళిపోతుందని తెలిపారు.
జిల్లాలో 83 శాతానికి పైగా వాక్సిన్ వేసారు, రెండవ డోస్ కూడా పూర్తి చేయాలన్నారు. ఈ నెలాఖరు వరకు 100 శాతం వాక్సిన్ పూర్తి చేయాలని సూచించారు.
మొదటి,రెండవ విడతలో కోవిడ్ పై బాగా పనిచేసిన వైద్య రంగం సిబ్బంది తో పాటు రెవెన్యూ, పంచాయతీ రాజ్, మునిసిపల్, పోలీస్ వారికి మంత్రి ఈ సందర్బంగా అభినందించారు.
జిల్లా పరిధిలో ఆస్పత్రులు, బెడ్లు, ఇతర వివరాలు నిత్యం ప్రజలకు తెలిసేలా చూడాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, మహేశ్వర్ రెడ్డి, కాలే యాదయ్య , కలెక్టర్ నిఖిల, అడిషనల్ కలెక్టర్లు మోతిలాల్ గారు,చంద్రయ్య, జిల్లా లైబ్రరీ, డిసీసీబీ, డీసీఎంఎస్ ల చైర్మన్లు మురళీకృష్ణ, మనోహర్ రెడ్డి,కృష్ణారెడ్డి,జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్,మునిసిపల్ చైర్మన్లు,కమిషనర్లు,కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Share This Post