జిల్లాలో నేటి నుండి (శుక్రవారం) ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి గోవింద్ రామ్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో నేటి నుండి (శుక్రవారం) ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి గోవింద్ రామ్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు.

శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృత్, అరబిక్ పరీక్షలకు 17,581 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 16,617 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 94 .52 శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని పేర్కొన్నారు. 964 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు వెల్లడించారు.

మొత్తం 24 పరీక్ష కేంద్రాలను సందర్శించినట్లు తెలిపారు. అందులో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి 2 పరీక్షా కేంద్రాలను, డి ఈ సి మెంబర్లు 4, హెచ్ పి సి మెంబర్లు 5, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 9, సిట్టింగ్ స్క్వాడ్స్ 4 పరీక్ష కేంద్రాలను సందర్శించి పరిశీలించినట్లు ఆయన తెలిపారు.

Share This Post