జిల్లాలో నేడు రుణ మేళా :: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, అక్టోబర్ 21: నేడు (శుక్రవారం) స్థానిక సూర్యాపేట రోడ్డులోని ఎన్ఎంఆర్ గార్డెన్స్ లో రుణ మేళా నిర్వహిస్తున్నట్లు, ఇట్టి మేళాను జిల్లా ప్రజలు, వ్యాపారులు, ఉద్యోగస్తులు అందరు సద్వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5. గంటల వరకు రుణ మేళా నిర్వహిస్తున్నట్లు, ఇందులో సుమారు 16 బ్యాంకులు పాల్గొననున్నట్లు ఆయన అన్నారు. బ్యాంకులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వ్యక్తిగత, గృహ నిర్మాణ, వాహన, విద్య, నాబార్డ్, పంట, టర్మ్ రుణాలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల ద్వారా చేపట్టే ఎస్సి, ఎస్టీ, మైనారిటీ, మహిళా రుణాలు, చిన్నతరహా భారీ పరిశ్రమలు, ఎంప్లాయ్మెంట్, స్టార్టప్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఎంపవర్మేంట్ జనరేషన్ ప్రోగ్రాం, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్, వీధీ వ్యాపారాలు, తదితర ప్రజా అవసరాల కోసం ఇచ్చే రుణ సదుపాయాల సేవలు అందిస్తారని ఆయన తెలిపారు. ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఆర్ధిక పరిపుష్టి దిశగా అడుగులు వేయాలని కలెక్టర్ అన్నారు. ఇట్టి రుణాలపై సంబందిత బ్యాంకుల సిబ్బంది అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్ళలో అందుబాటులో ఉంటారని, రుణాలకు సంబంధించి ఎలాంటి న్యాయ పరమైన సమస్యలు ఉన్నా, సహకారం అందించి పరిష్కార దిశగా చర్యలు చేపడతారని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
—————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారీ చేయనైనది.

Share This Post