జిల్లాలో పత్తి, మిర్చి కొనుగోలుకు సంబంధించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

నవంబరు 12, ఖమ్మం

జిల్లాలో పత్తి, మిర్చి కొనుగోలుకు సంబంధించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా  తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్లో మార్కెటింగ్, వ్యవసాయ శాఖ జిల్లా స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన. సమావేశంలో జిల్లాలో పత్తి, మిర్చి సాగు, దిగుమతి, కనీస మద్దతు ధర, కోల్డ్ స్టోరేజ్లో సౌలభ్యం తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరం పత్తి రైతులకు కనీస మద్దత్తు ధర కంటే అధికంగా ధర లభిస్తున్నదని, ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్ యార్డుకు వస్తున్న పత్తి విక్రయ రైతులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని, గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకొని తగు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మర్చికి సంబంధించి కూడా ఈ సంవత్సరం జిల్లాలో మిర్చి పంట విస్తీర్ణం పెరిగిందని, తదనుగుణంగా అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉన్నందున ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తో పాటు వైరా, మధిర, ఏన్కూరు మార్కెట్లో కూడా కొనుగోలు ప్రక్రియ జరిగేలా ముందస్తు సన్నాహక చర్యలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు .

అదనపు కలెక్టర్ ఎన్. మధుసూధన్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి విజయనిర్మల, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, జిల్లా ఉద్యానవన శాఖాధికారి అనసూయ, వ్యవసాయ శాఖ ఏ.డి శ్రీనివాసరావు, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post