జిల్లాలో పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం అందించేలా కృషి

జిల్లాలో పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం అందించేలా కృషి,
టీఎస్– ఐపాస్ ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు మంజూరు,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు తోడుగా మరిన్ని పరిశ్రమలు నెలకొల్పేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీఎస్ ఐపాస్ చట్టం ద్వారా జిల్లాలో కొత్తగా పరిశ్రమలకు మంజూరీతో పాటు అనుమతిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ (డీఐపీసీ) సమావేశాన్ని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రవీందర్ ఆధ్వర్యంలో శామీర్పేట కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మందిరరంలో నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా టీఎస్ ఐపాస్ చట్టం ద్వారా నూతనంగా పరిశ్రమలకు అనుమతివ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయా అనుమతులు, మంజూరుకు సంబంధించి పురోగతిని ఆయన సమీక్షించి వివరాలను తెలియచేశారు. జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ ఒక ఎస్సీ పారిశ్రామికవేత్తకు రూ.1,20,225, ఎస్టీ పారిశ్రామికవేత్తలైన 12 మందికి రూ.31,63,635 పెట్టుబడి రాయితీ కింద మంజూరు చేయడం జరిగిందని వివరించారు. అలాగే 4 పరిశ్రమలకు ముడిసరుకులు వాటిలో 3 – బొగ్గు, 1- ఆల్కహాల్ యూనిట్లను మంజూరు చేసినట్లు స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశ్రమలకు వీలైనంత త్వరగా అనుమతులు ఇచ్చి వారిని ప్రోత్సహించాలని దీనివల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి వివరించారు. జిల్లా చుట్టుపక్కల, పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్నో పరిశ్రమలు ఉన్నాయని వాటికి తోడు మరిన్ని పరిశ్రమలు నెలకొల్పేందుకు ఎందరో పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అన్ని రకాలుగా అనుకూలమై ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటే వారికి సకాలంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతించాలని నర్సింహారెడ్డి సూచించారు. అలాగే పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం సకాలంలో అందించాలని సమావేశంలో ఆయన అధికారులను ఆదేశించారు. దీంతో పాటుగా జిల్లాలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమలకు వివిధ శాఖల ద్వారా జారీ చేయాల్సిన అనుమతులలో పెండింగ్లో ఉంటే సంబంధిత దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుతించాలని తెలిపారు. జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పితే ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని దీనిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post