జిల్లాలో పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయు విధంగా ఔత్సాహికులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ చాంబర్ లో జిల్లా పారిశ్రామిక ప్రోత్సహక కమిటీ సమావేశం. నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 23.8.2021 నుండి 2.11.2021 వరకు 11 పరిశ్రమలకు 22 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 21 ధరఖాస్తులు ఆమోదించగా టిఎస్ఎస్ఐసి అధికారులు ఒక పరిశ్రమ ఏర్పాటుకు అభ్యంతరం తెలియచేశారని, తిరస్కరణకు గల కారణాలపై తనకు నివేదిక అందచేయాలని చెప్పారు. మంజూరు చేయబడిన 11 యూనిట్లు యొక్క విలువ 11.50 కోట్లు కాగా వీటి ద్వారా 115 మందికి ఉపాధి లభించనున్నట్లు ఆయన వివరించారు. పారిశ్రామిక ప్రోత్సాహక కమిటి సమావేశానికి గైర్హాజరైన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్కు షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణను అందచేయాలని పరిశ్రమల శాఖ జియంను ఆదేశించారు. తదుపరి నిర్వహించినున్న సమావేశంలో పరిశ్రమ ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తు తేది, అభ్యంతరపు తేది, పరిష్కరించబడిన వివరాలు, సమాచారం ఇచ్చిన వివరాలు నమోదుతో వివరాలు తెలియచేయాలని జియంకు సూచించారు. గతంలో ఏర్పాటు జరిగిన యూనిట్లుకు సబ్సిడీ మంజూరుపై సమగ్ర నివేదికలు ఇవ్వాలని చెప్పారు. పరిశ్రమలు ఏర్పాటుకు ఆసక్తి ఉన్న ఔత్సాహికులకు పరిశ్రమల శాఖ కార్యాలయంలో పూర్తి వివరాలు అందచేయబడతాయని, సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్పారు. పరిశ్రమల్లో రక్షణ చర్యలు అమలు జరుగుతున్నాయా లేదా అనే అంశంపై అగ్నిమాపక, కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల అధికారులు తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని చెప్పారు. రక్షణ చర్యలు తప్పక పాటించాలని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఎన్ని పరిశ్రమలను తనిఖీ చేయడం. జరిగిందో వాటిపై తనకు నివేదికలు ఇవ్వాలని చెప్పారు. పరిశ్రమలకు వచ్చే వాహనాలను రహదారులపై పార్కింగ్ చేయడం వల్ల ఇటు ప్రజలకు, అటు వాహనదారులకు ఇబ్బంది కలుగుతున్నదని, తప్పనిసరిగా పరిశ్రమలు ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలు పార్కింగ్ చేయు విధంగా చర్యలు తీసుకోవాలని, ఖచ్చితంగా అమలు చేసేందుకు పార్కింగ్ చేసిన సంస్థలకు నోటీసులు జారీ చేయాలని రవాణ, పరిశ్రమల అధికారులను ఆదేశించారు. రోడ్డు పార్కింగ్ ప్లేస్ కాదని ఆయన చెప్పారు. సమావేశానికి గైర్హాజరైన అధికారులకు నోటీసులు జారీ చేసి నివేదిక ఇవ్వాలని, ఇట్టి సమావేశం చాలా ముఖ్యమైనదని, అధికారులు మాత్రమే హాజరు కావాలని, తన అనుమతి లేకుండా క్రింది సిబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని జియంకు సూచించారు. వీధి వ్యాపారులకు ముద్ర రుణాలు మంజూరు చేయాలని ఎస్బీఐ చీఫ్ మేనేజరు సూచించారు. వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు జారీ చేయడంలో జాప్యం జరుగుతున్నదని, ప్రజలు ప్రజావాణిలో పిర్యాదు చేస్తున్నారని, జారీ చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతున్నదో తనకు సమగ్ర నివేదికలు అందచేయాలని మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్ను ఆదేశించారు. ఐడి కార్డులు జారీలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జియం సీతారాం, వాణిజ్య పన్నుల అధికారి తిరుపతిరెడ్డి, టిఎస్ఎస్ఐసిసి జోనల్ మేనేజర్ పవన్కుమార్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీనివాస్, ఏపిఓ జనరల్ డేవిథైరాజ్, ఆర్ఓ వేణు, కాలుష్య నియంత్రణ అధికారి రవిశంకర్, ఎస్సీ కార్పోరేషన్ ఈడి ముత్యం, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, విద్యుత్ శాఖ ఈ తదితరులు పాల్గొన్నారు.

Share This Post