పత్రికా పప్రకటన తేది 24-11-20 21
జిల్లాలో పల్లె ప్రకృతి వనాల కోసం ప్రతి మండలంలో తప్పని సరిగా సైట్స్ ను గుర్తించాలని జిల్లా కలెక్టర్ వల్లూర్ క్రాంతి తహసిల్దార్లకు ఆదేశించారు.
బుధవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు అన్ని మండలాల తహసిల్దార్లతో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ జిల్లా లో 12 మండలాలకు మొత్తం 60 సైట్స్ ఐడెంటిఫై చేయాలన్నారు. ప్రతి మండలం లో ప్రతి తహసిల్దారు తప్పనిసరిగా 5 సైట్స్ గుర్తించాలని, మీ పరిదిలో ఉన్న ప్రభుత్వ భూములు, వక్ఫ్ భూములు, ఎన్ని ఉంటే అన్ని గుర్తించి ప్రపోజల్ పంపించాలన్నారు. ఆలంపూర్, ధరూర్, గద్వాల్, గట్టు, కేటి దొడ్డి, వడ్డేపల్లి, రాజోలి, మల్దకల్, మానవపాడు, ఉండవెల్లి, ఇటిక్యాల , ఐ జ మండలాల వారిగా ఇప్పటివరకు గుర్తించిన భూమి ఎంత , ఉందని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామం లో సర్వేయర్ తో కలిసి విజిట్ చేసి ప్రబుత్వ భూములను గుర్తించి ప్రపోజల్ పంపించాలని ఆదేశించారు.
సమావేశంలో అదనపు కల్లెక్టర్లు రఘురాం శర్మ, శ్రీహర్ష , ఆర్ డి ఓ రాములు, అన్ని మండలాల తహసిల్దార్లు పాల్గొన్నారు.
—————————————————————————–
జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే జారి చేయబడినది.