జిల్లాలో పాఠశాలల పునః ప్రారంభానికి పూర్తి ఏర్పాట్లతో సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులకు ఆదేశించారు.

పత్రికా ప్రకటన
సంగారెడ్డి, ఆగస్ట్ 24:–
జిల్లాలో పాఠశాలల పునః ప్రారంభానికి పూర్తి ఏర్పాట్లతో సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులకు ఆదేశించారు.

సెప్టెంబర్ 1 నుండి అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు అంగన్ వాడీ కేంద్రాల పున ప్రారంభానికి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మంగళవారం నాడు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జడ్పీ చైర్ పర్సన్, అదనపు కలెక్టర్ తో కలిసి సంబంధిత శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మంచి వాతావరణంలో ఆరోగ్యకరమైన పరిసరాలలో చదువుకునే విధంగా పాఠశాలలను సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలలో , పరిసరాలలో పారిశుద్ధ్య పనులు చేపట్టి సుబ్రం చేయించాలన్నారు. తుప్పలు ముళ్ళ పొదలు తొలగించాలని టాయిలెట్స్ ను క్లీన్ చేయించడం రన్నింగ్ వాటర్ ఉండేలా చూడడం, త్రాగునీరు, విద్యుత్ తదితర వసతులు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైన పాఠశాల భవనాలకు వైట్ వాష్ చేయించాలన్నారు.

ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కలిసి ప్రతి పాఠశాలను సందర్శించాలన్నారు. వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని, అశుభ్రతకు తావివ్వకుండా పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామంలోని అన్ని ప్రభుత్వ సంస్థలను శుభ్రపర్చాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీదని స్పష్టం చేశారు. పంచాయతీ కార్యదర్శులు సర్పంచులు, సిబ్బంది, అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాఠశాలల పునః ప్రారంభానికి సమన్వయంతో పనిచేయాలన్నారు. మున్సిపల్ పరిధిలో మున్సిపల్ కమిషనర్లు బాధ్యత వహించాలని సూచించారు.
ఓ హెచ్ ఎస్ ఆర్, సింటెక్స్ వాటర్ ట్యాంక్ లను, వంటగదిని ప్రత్యేక శ్రద్ధ తో శుభ్రం చేయించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఎక్కడ ఇబ్బందులు తలెత్తే కూడదన్నారు. వర్షాలకు ఎక్కడైనా నానిన పాఠశాల భవనాలు, గదులు ఉన్నట్లయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని సూచించారు.
ప్రతి పాఠశాలలో శానిటైజర్/బకెట్లో నీళ్లు ,సబ్బు, మగ్గు ఉంచాలని, విద్యార్థులు భౌతిక దూరం పాటించడం ,మాస్కూలు విధిగా ధరించేలా చూడాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి నిబంధనలు పాటించే చూడాలని, జిల్లాలోని అన్ని వసతి గృహాలు రెసిడెన్షియల్ పాఠశాలలో జాగ్రత్తగా ఉండాలని సంబంధిత అధికారులకు సూచించారు.

పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి వినియోగించే ఆహారపదార్థాలు (ఫ్రెష్) తాజావి వినియోగించాలన్నారు. నిలువ ఆహార వస్తువులను వాడకూడదని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో డి పి ఓ, డి ఎల్ పి వో లు, పంచాయతీ సెక్రటరీలు, సర్పంచులు చూసుకోవాలని ఆదేశించారు. పాఠశాల ఉపాధ్యాయులు వంద శాతం హాజరుకావాలని ఆయన తెలిపారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పిహెచ్సి డాక్టర్ లతో కోఆర్డినేషన్ చేసుకోవాలని సూచించారు.

జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి మాట్లాడుతూ అధికారులు ప్రజా ప్రతినిధులు మండలంలో ఉన్న ప్రతి పాఠశాలను తనిఖీ చేయాలని సూచించారు. గ్రామపంచాయతీ సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు పారిశుద్ధ్య నిర్వహణ లో సహకరించాలని కోరారు. వసతి గృహాలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీలలో మున్సిపల్ చైర్ పర్సన్ ,మున్సిపల్ కమిషనర్, ప్రధానోపాధ్యాయులు ,ఎం ఈ ఓ లు కోఆర్డినేషన్ తో పని చేయాలన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులలో ఆత్మవిశ్వాసం నింపేలా బడులను సిద్ధం చేయాలన్నారు. పిల్లల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. బడుల పున ప్రారంభానికి సంబంధించి అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు భాగస్వాములై బాధ్యత తీసుకోవాలన్నారు .

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజర్షి షా, డి ఈ ఓ రాజేష్, dpo సురేష్ మోహన్, ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ ఈ రఘువీర్, పంచాయతీరాజ్ ఈ ఈ, సంక్షేమ శాఖల అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీపీలు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post