జిల్లాలో పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ గృహాల పనులను త్వరగా పూర్తి చేసేందుకు సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం.

ఆగష్టు, 19 ఖమ్మం –

జిల్లాలో పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ గృహాల పనులను త్వరగా పూర్తి చేసేందుకు సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో రోడ్లు భవనాలు, పంచాయితీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత ఏజెన్సీ బాధ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లాలో ఇంకనూ పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ గృహాల పనులపై కలెక్టర్ శాఖల వారీగా సమీక్షించారు. జిల్లాలోని మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలం లక్ష్మిపురం, చిన్నబీరవల్లి, పమ్మి, మధిర మండలం ఇల్లూరు, ఎర్రుపాలెం మండలం జమలాపురం అదేవిధంగా పాలేరు నియోజకవర్గంలోని నాయకనగూడెం, ఖమ్మం అర్బన్ ప్రాంతాలలో ఇంకనూ పూర్తి కావల్సిన డబుల్ బెడ్రూమ్ గృహాల పెండింగ్కు గల కారణాలను కలెక్టర్ సమీక్షించి అధికారులకు పలు ఆదేశాలు చేసారు. గృహసముదాయాల నిర్మాణాలకు ఇప్పటికే గుర్తించిన స్థలాలు అనువుగా లేనియెడల ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేయాలని గ్రామాలలో పురోగతిలో ఉన్న గృహసముదాయాల పనులను త్వరగా పూర్తి చేయాలని, ఇకంనూ స్థలాలు గుర్తించని మండలాల్లో యుద్ధ ప్రాతిపదికన అనువైన స్థలాలను గుర్తించి పనులు వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా మండలాల్లో గృహసముదాయాలు నిర్మాణాలకు సంబంధించిన సమస్యలపై సంబంధిత తహశీల్దార్ల నుంచి సమగ్ర నివేదిక కోరాలని జిల్లా. రెవెన్యూ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో రోడ్లు భవనాల శాఖ, పంచాయితీరాజ్, గిరిజన సంక్షేమ శాఖతో పాటు ఇ.డబ్ల్యూ ఐ.డి.సి ద్వారా చేపడ్తున్న గృహసముదాయాల పనులను సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఆయా ఏజెన్సీల బాధ్యులను సమన్వయపర్చి పనులు త్వరగా పూర్తయ్యేలా సత్వర చర్యలు ఉండాలని, ఇకముందు ఎలాంటి జాప్యం జరగకుండా పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శిరీష, రోడ్డు భవనాలు, పంచాయితీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శ్యాంప్రసాద్, జి.వి.చంద్రమౌళి, ఇ.డబ్లూ.ఐ.డి.సి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వీరుపాక్షి, సంబంధిత ఏజెన్సీల బాధ్యులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post